శివ 4K వచ్చేస్తుంది.. నాగ్ మాటిచ్చేశాడు..!
కింగ్ నాగార్జున రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా శివ. తెలుగు సినిమా చరిత్రలో ఈ సినిమా సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు.
By: Tupaki Desk | 16 Jun 2025 11:28 PM ISTకింగ్ నాగార్జున రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా శివ. తెలుగు సినిమా చరిత్రలో ఈ సినిమా సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. ఒక్కమాటలో చెప్పాలంటే టాలీవుడ్ అంటే శివ ముందు ఆ తర్వాత అని చెప్పుకుంటారు. ఆర్జీవి లాంటి అద్భుతమైన దర్శకుడు పరిశ్రమకు పరిచయం చేసిన సినిమా అది. నాగార్జున అతన్ని నమ్మి ఇచ్చిన అవకాశాన్ని అద్భుతం చేసి చూపించాడు.
ఆర్జీవి నాగార్జున కాంబినేషన్ లో వచ్చిన శివ రీ రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. స్టార్ సినిమాల రీ రిలీజ్ హంగామా ఏ రేంజ్ లో ఉంటుందో తెలిసిందే. ఇప్పటికే ఎన్నో సినిమాలు రీ రిలీజై ఫ్యాన్స్ ని ఫుల్ ఖుషి చేస్తున్నాయి. ఇక శివ రీ రిలీజ్ పై ఫ్యాన్స్ లో ఉన్న ఎగ్జైట్ మెంట్ నాగార్జునకి కూడా అర్ధమైంది. రీసెంట్ గా కుబేర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాగార్జున మాట్లాడుతున్న టైం లో శివ ఫ్లకార్డ్స్ తో అక్కినేని ఫ్యాన్స్ కనిపించారు. అవి గమనించిన నాగార్జున శివ 4K త్వరలో వస్తుందని అన్నారు.
మొత్తానికి శివ సినిమా రీ రిలీజ్ పై ఉన్న డౌట్స్ క్లారిఫై అయ్యాయి. శివ సినిమా రీ రిలీజ్ అవడం అంటూ జరిగితే మాత్రం కచ్చితంగా ఆ సినిమా మరోసారి సంచలనాలు సృష్టించే ఛాన్స్ ఉంటుంది. శివ 4K సినిమా రీ రిలీజ్ పై ఏర్పడుతున్న బజ్ చూస్తుంటే రీ రిలీజ్ కి ఈ సినిమా ఒక రేర్ ఫీట్ సాధించే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు.
1989 లో వచ్చిన శివ సినిమా పేరు మీద ఉన్న రికార్డులు అన్నీ ఇన్నీ కావు. ఆర్జీవి తొలి సినిమాతోనే ఒక సరికొత్త స్టోరీ టెల్లింగ్ తో ఆడియన్స్ ని ఆశ్చర్యపరిచాడు. ముఖ్యంగా కాలేజ్ పాలిటిక్స్ మీద ఉన్న వచ్చిన హై ఇంటెన్స్ మూవీగా శివ సెన్సేషన్ అనిపించుకుంది. ఇక అలాంటి సినిమా మళ్లీ వెండితెర మీద వస్తుందంటే కచ్చితంగా ఫ్యాన్స్ అంతా కూడా అలర్ట్ అవుతారని చెప్పొచ్చు. నాగార్జున శివ సినిమా రీ రిలీజ్ పై కొన్నాళ్లుగా పెద్ద డిస్కషన్స్ జరుగుతున్నా కూడా అఫీషియన్ గా ఎప్పుడు బయటకు చెప్పలేదు. కానీ ఈసారి నాగార్జుననే శివ 4K వస్తుంది అని చెప్పడంతో అక్కినేని ఫ్యాన్స్ అంతా కూడా సూపర్ హ్యాపీగా ఉన్నారు.
