అతడి లో విలనిజాన్ని డైరెక్టర్లు పెంచలేరా?
తాజాగా రిలీజ్ అయిన అజిత్ చిత్రం 'గుడ్ బ్యాడ్ అగ్లీ', నితిన్ 'రాబిన్ హుడ్' లోనూ అదే పరిస్థితి.
By: Tupaki Desk | 12 April 2025 11:00 PM ISTమాలీవుడ్ నటుడు షైన్ టామ్ చాకో గురించి పరిచయం అవసరం లేదు. ట్యాలెంటెడ్ నటుడు.మాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ఉన్న నటుడు. తెలుగులో చేసింది కొన్ని సినిమాలే అయినా ప్రేక్షకు ల్ని ఆకట్టుకున్నాడు. 'దసరా', 'రంగబలి', ' దేవర' లాంటి చిత్రాల్లో నటించాడు. ప్రతి నాయకుడిగా పాత్రల్లో మెప్పించాడు. అతడి ఆహార్యం, హవభాలు రెగ్యులర్ నటులకు భిన్నంగా ఉండటం అతడి ప్రత్యేకత.
కానీ తెలుగు సినిమాల్లో అతడి పాత్రలు చాలా పరిమితంగానే కనిపిస్తున్నాయి. తెరపై కనిపించినంత సేపు తన మార్క్ వేస్తున్నాడు. తనకిచ్చిన బాధ్యతను వందశాతం నెరవేరుస్తున్నాడు. కానీ టామ్ చాకో ట్యాలెంట్ కి ఆస్పాన్ సరిపోదు. అతడి పాత్రలు తెరపై ఇంకా బలంగా పండిచడానికి అవకాశం ఉంది. కానీ ఆ ఛాన్స్ ఏ దర్శకుడు తీసుకోవడం లేదు. తాజాగా రిలీజ్ అయిన అజిత్ చిత్రం 'గుడ్ బ్యాడ్ అగ్లీ', నితిన్ 'రాబిన్ హుడ్' లోనూ అదే పరిస్థితి.
ఇలా వచ్చి అలా వె ళ్లిపోయే పాత్ర అయినా? కనిపించినంత సేపు ఓ వేవ్ వచ్చిన అనుభూతి కలుగుతుంది. కానీ ఆ పాత్ర నిడివి చాలా తక్కువ. ఇంకా ఆ పాత్ర నిడివి పెంచితే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్త మవుతోంది. చిన్న, చితకా పాత్రలకే టైమ్ చాకో పరిమితం అవుతున్నాడు. అతడి ట్యాలెంట్ని సరిగ్గా వాడుకోలేకపోతున్నారు. మరి అలాంటి నటుడుకి సరైన రోల్ మళ్లీ ఎప్పుడు పడుతుందో చూడాలి.
మాలీవుడ్ లో మాత్రం తనకు తగ్గ పాత్రలు పడుతున్నాయి. అంత గొప్ప నటుడిగా ఎస్టాబ్లిష్ అయ్యాడంటే? కారణం అవకాశాల వల్లే. అలాంటి అవకాశాలు కోలీవుడ్...టాలీవుడ్ లో రావడం లేదు. 'పుష్ప' సినిమాతో టాలీవుడ్ లో ఫేమస్ అయిన మరో మలయాళ నటుడు పహాద్ పాజిల్ కి కూడా ఆ తర్వాత సరైన అవకాశాలు రావడం లేదనే ప్రచారం ఉంది. అయితే వచ్చిన కొన్ని అవకాశాల్ని తాను వదులుకున్నట్లు కూడా పహాద్ గతంలో రివీల్ చేసాడు. అవే ఛాన్సులు టైమ్ చాకో కి వస్తే వినియోగిం చుకునేవారేమో.
