రేవ్ పార్టీలో డ్రగ్స్.. ఒప్పుకున్న నటుడికి బెయిల్!
అయితే అతడు ఎర్నాకులం (కేరళ) పీఎస్ లో అరెస్ట్ అనంతరం సాధారణ బెయిల్ పొందాడని సమాచారం. ఈ ఆరోపణలు బెయిల్ ఇవ్వదగినవి.
By: Tupaki Desk | 19 April 2025 7:07 PM ISTమలయాళ ఇండస్ట్రీని డ్రగ్స్ కేసులు అట్టుడికిస్తున్న సంగతి తెలిసిందే. షైన్ టామ్ చాకో, శ్రీనాథ్ బాసిన లాంటి డ్రగ్ అడిక్ట్స్ ఇంకా చాలామంది పరిశ్రమలో ఉన్నారని మింట్ జర్నలిస్ట్ తన కథనంలో పేర్కొన్నాడు. ఇదిలా ఉండగానే, షైన్ టామ్ చాకో ఈ శనివారం ఉదయం 10 గంటల సమయంలో కొచ్చి పోలీసుల ఎదుట హాజరయ్యారు. అతడి ఇంటికి నిన్ననే పోలీసులు నోటీసులు అందజేసారు. అదే క్రమంలో టామ్ చాకో స్కిప్ కొట్టకుండా పోలీసుల ముందుకు హాజరై తన నేరాన్ని అంగీకరించాడు. తాను సిటీ ఔట్ స్కర్ట్స్ లో జరిగిన రేవ్ పార్టీలలో డ్రగ్స్ తీసుకున్నానని అంగీకరించడంతో అతడిని పోలీసులు అరెస్ట్ చేసినట్టు మీడియాలో కథనాలొస్తున్నాయి.
అయితే అతడు ఎర్నాకులం (కేరళ) పీఎస్ లో అరెస్ట్ అనంతరం సాధారణ బెయిల్ పొందాడని సమాచారం. ఈ ఆరోపణలు బెయిల్ ఇవ్వదగినవి. పోలీసు అధికారులు షైన్ టామ్ చాకోను నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్డీపీఎస్) చట్టంలోని వివిధ సెక్షన్ల కింద అరెస్టు చేశారు. సుమారు నాలుగు గంటల విచారణ అనంతరం అతడిపై సెక్షన్లు 27 (నార్కోటిక్ డ్రగ్స్ లేదా సైకోట్రోపిక్ పదార్థాల వినియోగం), 29 (నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్డీపీఎస్) చట్టంలోని అబద్ధం, నేరపూరిత కుట్ర) కింద కొచ్చి పోలీసులు కేసు నమోదు చేశారని `ది టైమ్స్` తన కథనంలో పేర్కొంది.
అయితే 32 ప్రశ్నలతో అతడిని పోలీసులు ఉక్కిరిబిక్కిరి చేసారు. ప్రధానంగా అతడు హోటల్ రూమ్ నుంచి ఎందుకు పారిపోయాడు? అనేదే ప్రశ్నించారు. తన ఇంటి ముందు ఉన్నది పోలీసులు అని తనకు తెలియదని, తనపై ఎవరో దుండగులు దాడికి ప్లాన్ చేసారని భావించి భయపడ్డానని, హోటల్ లోను అలాంటి దాడి జరుగుతుందనే భయంతోనే తాను పారిపోయినట్టు చాకో పోలీసులకు చెప్పినట్టు జాతీయ మీడియా కథనం పేర్కొంది. 2015లోను టామ్ చాకోపై మాదకద్రవ్యాల కేసు నమోదు కాగా, ఈ సంవత్సరం ప్రారంభంలో జరిగిన విచారణలో అతడు నిర్దోషిగా విడుదలైన విషయం తెలిసిందే. ప్రాసిక్యూషన్ సరైన ఆధారాలను సమర్పించడంలో విఫలమైందని కథనాలొచ్చాయి.
