డ్రగ్స్ కేసు: పెద్ద స్టార్లకు చిక్కులు తప్పవా?
గత కొంతకాలంగా డ్రగ్స్ ఆరోపణలతో మలయాళ చిత్రసీమ అట్టుడికిపోతున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 21 April 2025 10:03 PM ISTగత కొంతకాలంగా డ్రగ్స్ ఆరోపణలతో మలయాళ చిత్రసీమ అట్టుడికిపోతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నటుడు షైన్ టామ్ చాకోని అరెస్ట్ చేసి విచారించిన పోలీసులకు కళ్లు భైర్లు కమ్మే నిజాలు తెలుస్తున్నాయని సమచారం. నేటి విచారణలో టామ్ కొన్ని షాకింగ్ విషయాలను అధికారులకు చెప్పాడు. డ్రగ్స్ లో తనను, మరో నటుడిని మాత్రమే విచారిస్తున్నారని, ఇతర పెద్ద నటుల ప్రమేయం గురించి పట్టించుకోవడం లేదని కూడా నటుడు టామ్ పోలీసులను ఎదురు ప్రశ్నించాడు. చాలా మంది ఇందులో భాగంగా ఉన్నప్పుడు తమను మాత్రమే విచారించడమేమిటనేది టామ్ వాదనను వినిపించాడట.
అయితే పోలీసులు అతడి బ్యాంకింగ్ లావాదేవీలను పరిశీలించగా రూ.2000-రూ.5000 మధ్య ఆర్థిక లావాదేవీల్లో మొత్తం 14 లావాదేవీలు అనుమానాస్పదంగా ఉన్నాయని, డ్రగ్స్ కొనుగోళ్లతో సంబంధాలు ఉన్న లావాదేవీలు ఇవి అని అనుమానిస్తున్నారు. అయితే పలువురి నుంచి తాను రుణం తీసుకున్నానని షైన్ టామ్ చాకో అధికారులకు వివరణ ఇచ్చాడు. తదుపరి షైన్ ని సిటీ కమీషనర్ సమక్షంలో మరోసారి పోలీసులు విచారిస్తారని కూడా తెలుస్తోంది.
ఇదిలా ఉంటే, షైన్ తన శరీరంలోని డ్రగ్స్ ని కనుగొనకుండా విరుగుడు మందులు వాడాడని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. షైన్ స్వయంగా తాను డ్రగ్స్ ఉపయోగించానని పోలీసుల ముందు అంగీకరించినట్టు ఇప్పటికే మీడియాలో కథనాలొచ్చాయి. విరుగుడు మందులు వాడి మాదక ద్రవ్యాల పరిణామాన్ని పోలీసులు తెలుసుకోకుండా నిలువరించే ప్రయత్నం చేసాడని కూడా టామ్ పై అనుమానిస్తున్నట్టు మాతృభూమి వెబ్ సైట్ తన కథనంలో పేర్కొంది. షైన్ టామ్ చాకో తదుపరి విచారణలో కొన్ని పెద్ద స్టార్ల పేర్లను కూడా రివీల్ చేసే అవకాశం ఉందని ఇప్పుడు అధికారులు భావిస్తున్నారు. అతడి సెల్ ఫోన్ డేటా, లావాదేవీల ఆధారంగా ఇతర పెద్ద పేర్లను కనిపెట్టే అవకాశం ఉందని తెలిసింది.
