కారు ప్రమాదంపై స్పందించిన నటుడు!
మలయాళ నటుడు , 'దసరా' విలన్ షైన్ టామ్ చాకో కుటుంబ ఇటీవల కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 30 Jun 2025 12:45 PM ISTమలయాళ నటుడు , 'దసరా' విలన్ షైన్ టామ్ చాకో కుటుంబ ఇటీవల కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో తండ్రి సీపీ చాకో మృతి చెందగా, ఆయనతో పాటు కుటుంబ సభ్యులు తీవ్ర గాయాలతో బయట పడ్డారు. తాజాగా ఈ ఘటనపై టైన్ షామ్ చాకో ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. 'నేనెప్పటికీ మర్చిపోలేను. కళ్లు మూసి తెరిచేలోపు అంతా జరిగిపోయింది.
ఉదయం అమ్మ, నాన్న, సోదరుడు కారులో ప్రయాణిస్తున్నాం. నేను కారు వెనుక సీట్లో కూర్చున్నాను. నిద్ర రావడంతో పడుకున్నాను. మధ్యలో రెండు మూడుసార్లు మెలకువ రావడంతో నాన్నతో మాట్లాడి మళ్లీ పడుకున్నాను. ఆ తర్వాత కొంత సేపటికీ ఉలిక్కి పడి నిద్రలేచి చూస్తే కారు ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో నాకేం అర్దం కాలేదు. అంతా రోడ్డు మీద ఉన్నామనే విషయం కూడా తెలియలేదు.
నాన్నను ఎన్నిసార్లు పిలిచినా పలకలేదు. అమ్మ షాక్ లో ఉంది. ఎన్నోసార్లు రోడ్డు ప్రమాదాల గురించి విన్నాను. చూసాను. కానీ నేరుగా ఘటన ఎదుర్కోవడం ఇదే తొలిసారి.ఆ సమయంలో దయచేసి ఎవరైనా సాయం చేయండని కేకలు వేసాను. మమ్మల్ని ఆసుపత్రికి తీసుకువెళ్లండని అరిచాను. ఇప్పటికీ ఆప్రమాదం ఎలా జరిగిందో గుర్తుకు రావడం లేదు.
ఆరోగ్యపరమైన కారణాల వల్ల కొంత కాలంగా నేను చికిత్స తీసుకుంటున్నాను. అందువల్ల ఎక్కువ సేపు నిద్రలోనే ఉంటున్నాను. ప్రమాదం జరిగిన రోజు కూడా మందులు తీసుకోవడం వల్లే నిద్రపోయాను. అందుకే ఏం జరిగిందో అర్దం కాలేదు. నాకు తగిలిన గాయాలకు 30 కుట్లు పడ్డాయి. నాన్న మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని భావోద్వేగానికి గురయ్యారు
