శ్రీవిష్ణు #సింగిల్.. కలర్ఫుల్ మెలోడిగా 'శిల్పి ఎవరో'
'#సింగిల్’ అనే టైటిల్‌తో వస్తున్న ఈ సినిమా ఓ డిఫరెంట్ ట్రయాంగిల్ లవ్ స్టొరీగా ఉండనుందని తెలుస్తోంది.
By: Tupaki Desk | 4 April 2025 6:40 AMటాలీవుడ్ ఇండస్ట్రీలో డిఫరెంట్ కంటెంట్ సినిమాలతో ప్రయోగాలు చేసే అతికొద్ది మంది హీరోలలో శ్రీవిష్ణు ఒకరు. ఇప్పుడు మరోసారి ప్రేమ కథలో తనదైన ముద్ర వేసేందుకు సిద్ధమయ్యాడు. '#సింగిల్’ అనే టైటిల్‌తో వస్తున్న ఈ సినిమా ఓ డిఫరెంట్ ట్రయాంగిల్ లవ్ స్టొరీగా ఉండనుందని తెలుస్తోంది. ప్రేమకు దూరంగా ఉండమంటూ చెప్పే వ్యక్తి చివరికి ప్రేమలో పడతాడా..? అనే ఆసక్తికరమైన కథతో తెరకెక్కుతోంది ఈ సినిమా. కార్తిక్ రాజు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి కథానాయికలుగా కేతికా శర్మ, ఇవానా నటిస్తున్నారు.
ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో విద్యా కొప్పినీడి, భాను ప్రతాప్, రియాజ్ చౌదరీలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా మే 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే పోస్టర్లతో అందర్నీ ఆకట్టుకున్న ఈ సినిమా నుంచి తాజాగా 'శిల్పి ఎవరో' అనే లిరికల్ మెలోడీ పాట విడుదలైంది. విశాల్ చంద్రశేఖర్ అందించిన ఈ మెలోడీగా హార్ట్ ను టచ్ చేసేలా ఉంది.
యాజిన్ నజీర్ ఆలపించిన ఈ పాటకు శ్రీమణి సాహిత్యం అందించారు. వయలిన్ వాయిద్యం ప్రధానంగా వినిపించే ఈ పాట ఓ శాంతమైన ప్రేమ స్పర్శను కలిగిస్తుంది. పాటలో వినిపించే సంగీతం, మాటలు ప్రేమలో కొత్త హాయిని తీసుకొస్తున్నాయి. శ్రీ విష్ణు పాటలో తన నటనతో, చూపులోనూ కనిపించే నిజమైన ప్రేమతో ఆకట్టుకుంటున్నాడు. కథానాయికలతో అతని కెమిస్ట్రీ చక్కగా వర్కౌట్ అయ్యింది.
కేతికా శర్మ, ఇవానా ఇద్దరూ కలర్‌ఫుల్ వేషధారణతో పాటకు అందాన్ని తక్కువేంటి.. పెంచేశారు. స్టెప్స్, లోకేషన్లు, లైటింగ్ అన్నీ ఈ మెలోడీకి ఒక మంచి ఫీల్ ను తీసుకు వచ్చాయి. ప్రస్తుతం ఈ పాటను నెట్‌లో చూసినవారు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్ తనదైన మ్యూజిక్ టచ్‌ను చూపించాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. పాటకు వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే, సినిమా మీద ఉన్న అంచనాలు మరింత పెరిగేలా కనిపిస్తున్నాయి.
మొత్తానికి ‘శిల్పి ఎవరో’ పాట ‘సింగిల్’ సినిమాకు సరైన లాంచ్‌గా నిలిచింది. మెలోడీ ప్రేమికుల మనసులు దోచే ఈ పాట... కథలోని ఎమోషన్‌ను ఎలివేట్ చేయగలదనే నమ్మకం మేకర్స్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. మే 9న సినిమా విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో, ఈ పాట మరింత హైప్‌ను తీసుకొస్తోంది. మరి ఈ పాట ఆకట్టుకున్నట్లే సినిమా కూడా ఆ స్థాయిలో అలరించగలుగుతుందేమో చూడాలి.