Begin typing your search above and press return to search.

సాగ‌ర క‌న్య 'పింక్ గులాబీ' అవతార్

సాగ‌ర క‌న్య శిల్పాశెట్టి ఇటీవ‌ల 'ది పోలీస్ ఫోర్స్' సిరీస్ లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇందులో ప‌వ‌ర్‌ఫుల్ లేడీ కాప్ గా శిల్పాజీ న‌టించారు

By:  Tupaki Desk   |   5 March 2024 4:10 AM GMT
సాగ‌ర క‌న్య పింక్ గులాబీ అవతార్
X

సాగ‌ర క‌న్య శిల్పాశెట్టి ఇటీవ‌ల 'ది పోలీస్ ఫోర్స్' సిరీస్ లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇందులో ప‌వ‌ర్‌ఫుల్ లేడీ కాప్ గా శిల్పాజీ న‌టించారు. రోహిత్ శెట్టి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సిరీస్ లో సిద్ధార్థ్ మ‌ల్హోత్రా, వివేక్ ఒబేరాయ్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషించారు. ఈ సిరీస్ లో శిల్పా శెట్టి న‌ట‌న‌కు గొప్ప పేరొచ్చింది.

మ‌రోవైపు శిల్పా శెట్టి బుల్లితెర హోస్ట్ గా, రియాలిటీ షోల జ‌డ్జిగాను చెప్పుకోద‌గ్గ ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. ఫ్యాష‌న్ ఈవెంట్ల‌లోను సంద‌డి చేస్తున్నారు. గ‌డిచిన రెండేళ్ల‌లో శిల్పా శెట్టి త‌న భ‌ర్త‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల కార‌ణంగా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్న సంగ‌తి తెలిసిందే. అయితే అన్నిటి నుంచి బ‌య‌ట‌ప‌డి నెమ్మ‌దిగా కెరీర్ పై శ్ర‌ద్ధ వ‌హించిన శిల్పా శెట్టి బుల్లితెర రంగంలో త‌న హ‌వా త‌గ్గ‌కుండా కంబ్యాక్ అవ్వ‌డంలో అంద‌రికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

శిల్పాశెట్టి కుంద్రా తాజాగా 'మాంప్రెన్యూయర్ ఫ్యాషన్'పై త‌న‌కు ఉన్న అభిరుచిని తల్లిగా తన పాత్రను ఓ ఇంట‌ర్వ్యూలో వివ‌రించారు. అంతేకాదు తాను పిల్లల దుస్తుల శ్రేణి వ్యాపారంలోకి ప్ర‌వేశిస్తున్నాన‌ని తెలిపారు. శిల్పాశెట్టికి చెందిన‌ సంస్థ భాగ‌స్వామ్యంలో సొంత లేబుల్ ని తీసుకువస్తుంది. 'జిప్ జాప్ జూప్' వ్యవస్థాపకురాలు అష్మికా సాద్‌తో కలిసి పిల్ల‌లు యువ‌త‌రం ఫ్యాషన్ కి సంబంధించిన దుస్తుల రంగంలో శిల్పా శెట్టి ప్ర‌వేశించ‌నుంది.

మ‌రోవైపు శిల్పా త‌న వ‌ర్క్ క‌మిట్ మెంట్ల‌తోను బిజీగా ఉన్నారు. శిల్పాశెట్టి తాజాగా త‌న లేటెస్ట్ ఫోటోషూట్ ని షేర్ చేసి దానికి 'వికసించే రాత్రులు' అనే అంద‌మైన క్యాప్ష‌న్ ని ఇచ్చింది. #OOTN కోసం గ‌త రాత్రి చేసిన షో నుంచి ఫోటోషూట్ ఇది. తాను వ‌ర్క్ మోడ్ లో ఉన్నాన‌ని కూడా శిల్పా శెట్టి వెల్ల‌డించారు. ఈ ఫోటోషూట్ లో శిల్ప చాలా అద్భుతంగా కనిపిస్తోంది..ఆల్ ది వెరీ బెస్ట్! అంటూ అభిమానులు త‌న‌ను ప్రశంసించారు. శిల్పాశెట్టి నయా 'పింక్ గులాబీ అవ‌తార్' ఇప్పుడు అంత‌ర్జాలంలో వైరల్ గా మారింది.