Begin typing your search above and press return to search.

మ‌హేష్ మ‌ర‌ద‌లు హెయిర్ డ్రెస్స‌ర్ జాబ్?

శిల్పా శిరోద్క‌ర్ ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. టీవీ మూవీ న‌టిగా సుప‌రిచితురాలు. బిగ్ బాస్ 18లోను క‌నిపించారు.

By:  Tupaki Desk   |   10 July 2025 9:40 AM IST
మ‌హేష్ మ‌ర‌ద‌లు హెయిర్ డ్రెస్స‌ర్ జాబ్?
X

శిల్పా శిరోద్క‌ర్ ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. టీవీ మూవీ న‌టిగా సుప‌రిచితురాలు. బిగ్ బాస్ 18లోను క‌నిపించారు. అంత‌కుమించి సూప‌ర్‌స్టార్ మ‌హేష్ భార్య న‌మ్ర‌త శిరోద్క‌ర్ కి సోద‌రి. 2000లో గ‌జ‌గామిని అనే చిత్రంతో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన శిల్పా, బాలీవుడ్ లో పలు చిత్రాల్లో న‌టించారు. అయితే ప్ర‌ముఖ బ్యాంక‌ర్ ఆప‌రేష్ రంజిత్ ని పెళ్లాడి న్యూజిలాండ్ లో సెటిల‌య్యారు.

తాను న‌టి కాక మునుపు, పెళ్లికి ముందు హెయిర్ డ్రెస్స‌ర్ గా ఓ సెలూన్ లో జాబ్ చేసాన‌ని నిజాయితీగా అంగీక‌రించారు శిల్పా శిరోద్క‌ర్. అది సినిమాకు ద‌గ్గ‌ర‌గా ఉంద‌నిపించింద‌ని తెలిపారు. మేక‌ప్ విభాగంలో తాను శిక్ష‌ణ తీసుకున్నాన‌ని, అదే క్ర‌మంలో ఉద్యోగం కోసం వెతుకుతూ సెలూన్ లో ప‌ని చేసాన‌ని వెల్ల‌డించారు. నన్ను నేను బిజీగా ఉంచుకోవడానికి, నేను న్యూజిలాండ్‌లో హెయిర్‌డ్రెస్సింగ్ కోర్సు చేసాను. రెండు నెల‌లు సెలూన్ లో ప‌ని చేసాన‌ని అన్నారు. అయితే ఉద్యోగ జీవితాన్ని ఫ్యామిలీ లైఫ్ ని బ్యాలెన్స్ చేయ‌డం వీలు ప‌డ‌లేదు. దీంతో వెంట‌నే ఆ ఉద్యోగాన్ని వ‌దిలేసాన‌ని శిల్పా వెల్ల‌డించారు. ఒక కార్పొరెట్ కంపెనీలో ఫైనాన్స్ కంట్రోల‌ర్ ఉద్యోగంలోను చేరాన‌ని తెలిపారు. నెద‌ర్ లాండ్స్, న్యూజిలాండ్స్ తో త‌న‌కు ఉన్న అనుబంధం గురించి శిల్పా శిరోద్క‌ర్ ఈ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించారు.

శిల్ప 2018లో టెలివిజన్ షో 'సావిత్రి దేవి కాలేజ్ & హాస్పిటల్‌'తో తిరిగి నటనలోకి వచ్చింది. బిగ్ బాస్ సీజ‌న్ 18లో త‌న ప్ర‌తిభ‌తో ఆక‌ట్టుకుంది. తదుపరి సుధీర్ బాబు-సోనాక్షి సిన్హా జంట‌గా న‌టిస్తున్న హార‌ర్ థ్రిల్లర్ 'జటాధార'లో కనిపించ‌నుంది.