నటిని కాల్చి చంపారు.. ఇదోరకం ప్రచార టెక్నిక్!
కానీ ఇది ప్రచారం కోసం అని తెలిసి శిల్పా శిరోద్కర్ ఖంగు తిన్నారట. కానీ ఈ సినిమా సాధించిన విజయం చూశాక అది తప్పు అయినా కానీ నిర్మాతను ఏమీ అనలేదని తెలిపారు.
By: Tupaki Desk | 22 July 2025 11:12 PM ISTఓవైపు నటి షూటింగ్ లో బిజీగా ఉంది. స్టార్ హీరోతో సన్నివేశాల చిత్రీకరణ సాగుతోంది. ఇంతలోనే సడెన్ గా ఒక వార్త. ప్రముఖ నటిని షూట్ చేసి చంపారని పత్రికలో హెడ్ లైన్ లో వచ్చింది. ఆ విషయం సెట్లో ఉన్నవాళ్లెవరికీ తెలీదు. ఈ వార్త చదివిన వెంటనే సదరు హీరోయిన్ తల్లిదండ్రులు తీవ్రంగా కంగారు పడ్డారు. నిజంగానే తమ కుమార్తెను దుండగులు కాల్చి చంపారని భావించారు.
అయితే ఇదంతా దేనికోసం? అంటే.. పబ్లిసిటీ స్టంట్ అని నిర్మాత చెప్పారు. వినేందుకు హారిబుల్‌గా లేదా టెరిబుల్ గా ఉంది కదా! అయినా ఇది నిజం. నమ్రత శిరోద్కర్ సోదరి శిల్పా శిరోద్కర్- సునీల్ శెట్టి జంటగా నటిస్తున్న ఓ సినిమా షూటింగ్ సమయంలో శిల్పా ను ఎవరో కాల్చి చంపారని నిర్మాత గుల్షన్ మీడియాలో ఇలాంటి ప్రచారం చేయించారు. పత్రికల్లో వార్త చదివిన ఆమె తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనలో దుఃఖించారు.
కానీ ఇది ప్రచారం కోసం అని తెలిసి శిల్పా శిరోద్కర్ ఖంగు తిన్నారట. కానీ ఈ సినిమా సాధించిన విజయం చూశాక అది తప్పు అయినా కానీ నిర్మాతను ఏమీ అనలేదని తెలిపారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నాటి ఘటనను మరోసారి గుర్తు చేసుకున్నారు. కులు మనాలిలో షూటింగ్ సమయంలో తమ వద్ద ఆ రోజుల్లో మొబైల్ ఫోన్లు కూడా లేవని చెప్పారు. చిత్రీకరణ పూర్తి చేసుకుని హోటల్ గదికి తిరిగి వచ్చినప్పుడు దాదాపు 20-25 మిస్డ్ కాల్స్ వచ్చాయి. నా తల్లిదండ్రులు ఆందోళన చెందారు.. శిల్పా శిరోద్కర్ ను కాల్చి చంపారని ఒక వార్తాపత్రికలో హెడ్‌లైన్ వచ్చింది అని శిల్పా చెప్పారు. నిర్మాత గుల్షన్ కుమార్ తరువాత అది ప్రమోషన్ల కోసం ఒక టెక్నిక్ అని చెప్పారట.
