బాస్టియన్ కు బై బై.. ఎమోషనల్ పోస్ట్ పంచుకున్న శిల్పా శెట్టి!
బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టి దంపతులు ఈ మధ్యకాలంలో వరుసగా వార్తల్లో నిలుస్తున్నారు.
By: Tupaki Desk | 3 Sept 2025 2:07 PM ISTబాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టి దంపతులు ఈ మధ్యకాలంలో వరుసగా వార్తల్లో నిలుస్తున్నారు. ఎప్పుడు ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూ హాట్ టాపిక్ గా నిలుస్తున్న ఈ జంట తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా తమ ఫేమస్ రెస్టారెంట్ ని మూసివేస్తున్నట్టు ప్రకటించి హాట్ టాపిక్ గా మారారు. మరి ముంబైలో ఎంతో ఫేమస్ అయిన రెస్టారెంట్ ని శిల్పా శెట్టి దంపతులు ఎందుకు మూసివేస్తున్నారు.. ? అప్పుల కారణంగానే రెస్టారెంట్ ని మూసి వేస్తున్నారా.. ?లేక కొత్త బిజినెస్ లోకి అడుగు పెట్టబోతున్నారా? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టి సినిమాల్లోనే కాదు వ్యాపార రంగంలో కూడా రాణిస్తోంది.అలా ఇప్పటికే పలు వ్యాపారాలను స్టార్ట్ చేసిన శిల్పా శెట్టి.. తన భర్త రాజ్ కుంద్రాతో కలిసి బిజినెస్ లో సక్సెస్ అయింది. కానీ గత కొద్ది రోజుల నుండి ఈ జంట తరచూ చిక్కుల్లో పడుతోంది. ఈ మధ్యనే ముంబైకి చెందిన ఓ వ్యాపారవేత్త శిల్పా శెట్టి దంపతులు తనను మోసం చేశారని, రూ.60 కోట్లు నష్టపోయానంటూ వాళ్ల మీద కేసు పెట్టిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ కేసు సంగతి మరువకముందే మరోసారి వార్తల్లో నిలిచారు ఈ జంట.
తాజాగా శిల్పా శెట్టి, రాజ్ కుంద్రాలకు సంబంధించిన 'బాస్టియన్' అనే రెస్టారెంట్ ని గురువారం రోజు మూసివేస్తున్నట్టు తన సోషల్ మీడియా ఖాతా ఇంస్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా ప్రకటించింది శిల్పా శెట్టి. తన బాస్టియన్ రెస్టారెంట్ గురించి చెబుతూ.. "బాస్టియన్ మాకు ఎన్నో జ్ఞాపకాలను అందించింది. ఈ రెస్టారెంట్లో మాకు మర్చిపోలేని అందమైన క్షణాలు ఎన్నో ఉన్నాయి. ఎన్నో సంతోషాలను అందించిన ఈ రెస్టారెంట్ వేదిక ఇకపై మూత పడనుంది. ఈ రెస్టారెంట్లో చివరిసారిగా అనగా గురువారం రోజు ఒక పెద్ద వేడుక నిర్వహిస్తున్నాం. ఈ వేడుకలో మా సన్నిహితులు, వ్యాపార భాగస్వాములు అందరూ పాల్గొంటారు. అంతేకాదు కొత్త అనుభవాలతో త్వరలోనే మీ ముందుకు వస్తాను" అంటూ ప్రకటించింది.అయితే శిల్పా శెట్టి ప్రకటన క్షణాల్లో వైరల్ గా మారడంతో చాలామంది నెటిజన్లు ఇదేంటి ఈ హీరోయిన్ తన రెస్టారెంట్ ని ఎందుకు మూసివేస్తోంది..దానికి కారణాలేంటి అని చర్చించుకుంటున్నారు..
ముంబైలో ఉండే ఫేమస్ రెస్టారెంట్లలో శిల్పా శెట్టికి సంబంధించిన బాస్టియన్ రెస్టారెంట్ కూడా ఒకటి.ఈ రెస్టారెంట్ కు ముంబైలో ఏకంగా ఆరు బ్రాంచ్ లు ఉన్నాయి. అలాంటి ఈ ఫేమస్ రెస్టారెంట్ ని శిల్పా శెట్టి దంపతులు మూసి వేయడానికి కారణం ఏంటో తెలియాల్సి ఉంది. అయితే తాజాగా బాస్టియన్ రెస్టారెంట్ ని మూసివేస్తున్నట్టు తెలిపిన ప్రకటనలో త్వరలోనే కొత్త అనుభవాలతో మీ ముందుకు వస్తానని తెలిపింది కాబట్టి శిల్పా శెట్టి దంపతులు మళ్లీ ఏదైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నారా అనే అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి. ఈ రెస్టారెంట్ మూసి వేయడానికి అసలు కారణం ఏంటో తెలియాల్సి ఉంది.చాలా రోజుల నుండి సినిమాలకు దూరంగా ఉంటున్న శిల్పా శెట్టి వివాదాల ద్వారా మాత్రం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తోంది.
