నెలకు 6కోట్లు.. నటి రెస్టారెంట్ ఆదాయం
అయితే బాస్టియన్ లో పెట్టుబడి పెట్టడానికి ముందు, బాంద్రాలోని తొలి రెస్టారెంట్ లో తినడానికి రాజ్ కుంద్రా- శిల్పా శెట్టి వెళ్లారట.
By: Tupaki Desk | 18 Jun 2025 9:46 AM ISTశిల్పా శెట్టి బాలీవుడ్ సహా దక్షిణాది చిత్రసీమకు సుపరిచితమైన పేరు. ఈ భామ ప్రస్తుతం హిందీ సినిమాల్లో నటిస్తోంది. బుల్లితెర రియాలిటీ షోల జడ్జిగాను కొనసాగుతోంది. శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా ప్రముఖ బిజినెస్ మేన్ అన్న సంగతి తెలిసిందే.
అయితే శిల్పాశెట్టికి ఆదాయం కేవలం నటన ద్వారానే కాదు బాస్టియన్ రెస్టారెంట్ చైన్ ద్వారాను ప్రధానంగా ఉంది. మొదట ముంబై బాంద్రాలో ప్రారంభమైన బాస్టియన్, ఆ తర్వాత నెమ్మదిగా నగరంలోని పలు ప్రాంతాలకు విస్తరించింది. 2019లో బాస్టియన్ బ్రాండ్ వ్యవస్థాపకుడు, రెస్టారెంట్ యజమాని రంజిత్ బింద్రాతో శిల్పా భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా పలు మెట్రో నగరాల్లోని బాస్టియన్ రెస్టారెంట్లకు సహ యజమానిగా శిల్పాశెట్టి కొనసాగుతోంది. ఈ బ్రాండ్‌లో 50 శాతం వాటా తన సొంతం.
నిజానికి ఆతిథ్య రంగం నా ప్లాన్ బి. నటనా రంగంలో కూడా అద్భుతంగా ఉన్నాను అని చెబుతున్న శిల్పాశెట్టి, బాస్టియన్ ని ముంబై, పూణే, బెంగళూరు, పూణే వంటి చోట్లకు విస్తరించామని తెలిపారు. అంతేకాదు గోవాలో మరో రెండు బాస్టియన్ రెస్టారెంట్లను ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. బాస్టియన్ నుంచి 5-6 కోట్ల మేర నెలవారీ ఆదాయం వస్తోందని అంచనా. అయితే అంతకుమించి ఆర్జిస్తున్నామని, అత్యధిక జీఎస్టీ కట్టిన రెస్టారెంట్ బాస్టియన్ అని కూడా శిల్పాశెట్టి తెలిపింది. ముఖ్యంగా సినీ సెలబ్రిటీలు రెగ్యులర్ గా బాస్టియన్ లో ఆహారం తినేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు.
అయితే బాస్టియన్ లో పెట్టుబడి పెట్టడానికి ముందు, బాంద్రాలోని తొలి రెస్టారెంట్ లో తినడానికి రాజ్ కుంద్రా- శిల్పా శెట్టి వెళ్లారట. ఆ సమయంలో బాస్టియన్ యజమాని రంజిత్ సరైన పెట్టుబడులు పెట్టే వాటాదారు కోసం వెతుకుతున్నారు. వెంటనే బాస్టియన్ లో పెట్టుబడులు పెట్టారు. ఇప్పుడు ఆరు చోట్ల బాస్టియన్ రెస్టారెంట్లు ఉన్నాయి. ముంబైలో బాంద్రా, దాదర్, వర్లిలో రెస్టారెంట్లు ఉన్నాయి. పెరువియన్-ఆసియన్ రెస్టారెంట్ అని మరొకటి వీరికి బోండీ ప్రాంతంలో ఉంది. పూణేలో ఒక రెస్టారెంట్ ఉంది. గోవాలో రెండు ప్రారంభిస్తున్నాము.. మాకు 6 కంటే ఎక్కువ రెస్టారెంట్లు ఉన్నాయి అని శిల్పాశెట్టి తెలిపింది.
చాలామంది సోషల్ మీడియాలో బాస్టియన్ ఆహారం, ఎగ్జయిట్ చేసే ఇంటీరియర్‌ల గురించి ప్రశంసలు కురిపిస్తారు.. నటి సోనాక్షి సిన్హా, ఆమె భర్త జహీర్ ఇక్బాల్ బాస్టియన్‌లో వారి గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్‌ను కూడా నిర్వహించారు. ఒక అంచనా ప్రకారం.. శిల్పా శెట్టి నికర ఆస్తి విలువ 35 మిలియన్ డాలర్లు. దాదాపు రూ.134 కోట్ల నికర ఆస్తి ఉందని అంచనా. ఆమె భర్త రాజ్ కుంద్రా నికర ఆస్తులు వందల కోట్లు. దుబాయ్ లోను వీరికి విల్లాలు ఉన్నాయి.
