Begin typing your search above and press return to search.

సాగ‌ర క‌న్య వ‌య‌సు 50 కాదు 20

అయితే వీటిలో వైట్ అండ్ వైట్ టూపీస్ లో ఫోటోషూట్ అభిమానుల‌ను ఎగ్జ‌యిట్ చేస్తోంది.

By:  Tupaki Desk   |   12 Jun 2025 6:00 AM IST
సాగ‌ర క‌న్య వ‌య‌సు 50 కాదు 20
X

కొంద‌రికి వ‌యసు కేవ‌లం నంబ‌ర్ మాత్ర‌మే. అది ఎప్ప‌టికీ ప్ర‌భావితం చేయ‌దు. మ‌న‌సుండాలే కానీ ఆస్వాధ‌న‌కు అస‌లు వ‌య‌సుతో ప‌నేంటి? ఇదిగో ఇక్క‌డ శిల్పా శెట్టి ప‌రిణ‌తి ఎప్పుడూ మ‌న‌సులను గెలుచుకుంది. సాగ‌ర‌క‌న్య‌గా తెలుగు యువ‌త గుండెల్లో కొలువు దీరిన శిల్పాజీ.. బిజినెస్‌మేన్ రాజ్ కుంద్రాను పెళ్లాడిన‌ప్పుడు చాలా గుండెలు ఆగిపోయాయి. కానీ ఆ జంట అన్యోన్య దాంప‌త్యం, ఇద్ద‌రు పిల్లలకు మామ్ డాడ్ గా ఫ్యామిలీ లైఫ్ గోల్స్ ని ఫిక్స్ చేయ‌డంలో ఎప్పుడూ విఫ‌లం కాలేదు.

ఎన్నో వివాదాలు.. అన్నిటిలో భ‌ర్త వెంటే శిల్పా శెట్టి. ఇటీవ‌ల సుదూర తీరాల‌కు వెకేష‌న్ కి వెళ్లిన శిల్పా శెట్టి రేర్ ఫోటో క్లిక్స్ ని షేర్ చేసింది. అయితే వీటిలో వైట్ అండ్ వైట్ టూపీస్ లో ఫోటోషూట్ అభిమానుల‌ను ఎగ్జ‌యిట్ చేస్తోంది. ఈ ఫోటోషూట్‌లో శిల్పా శెట్టి నేటి త‌రానికి కూడా చెమ‌ట‌లు ప‌ట్టించే భంగిమ‌ల‌తో చెల‌రేగిపోయింది.

బాలీవుడ్ యోగా క్వీన్ శిల్పా శెట్టికి వయస్సు కేవలం ఒక సంఖ్య మాత్రమే! ఈ బ్యూటీకి ఇప్పుడే 50 ఏళ్లు వచ్చాయి కానీ త‌న‌ శరీరం 20 ఏళ్ల వ‌ద్ద‌నే ఆగిపోయింది అంటూ అభిమానులు కాంప్లిమెంట్లు ఇస్తున్నారు. వైట్ అండ్ వైట్ టూపీస్ లో శిల్పాజీ ఫోజులు యూత్ లో గుబులు పుట్టిస్తున్నాయి. కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే, ఇంత‌కుముందు రోహిత్ శెట్టి సింగం ఎగైన్‌లో క‌నిపించింది. ఓవైపు సినిమాల్లో న‌టిస్తూనే, మ‌రోవైపు శిల్పాశెట్టి డ్యాన్స్ రియాలిటీ షోల‌తో భారీగా ఆర్జిస్తోంది.