Begin typing your search above and press return to search.

వీడియో: మ‌న‌సు దోచిన‌ ధావ‌న్ గాళ్ ఫ్రెండ్

తాజాగా షేర్ చేసిన క్లిప్‌లో ధావన్ - షైన్ పంజాబీ సాంప్రదాయ దుస్తులను ధరించి, సరదాగా సరదాగా మాట్లాడుకుంటూ క‌నిపించారు.

By:  Tupaki Desk   |   13 April 2025 10:00 PM IST
వీడియో: మ‌న‌సు దోచిన‌ ధావ‌న్ గాళ్ ఫ్రెండ్
X

శిఖ‌ర్ ధావ‌న్.. అతడు ఒక ఆట‌గాడా? న‌టుడా? ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం అత‌డి ఇన్ స్టాగ్రామ్ వెతికితే దొరుకుతుంది. క్రికెట్ నుంచి అత‌డు రిటైర్ మెంట్ ప్ర‌క‌టించిన త‌ర్వాత కూడా ధావ‌న్ బోయ్ నిరంత‌రం మీడియా హెడ్ లైన్స్ లో నిలుస్తూనే ఉన్నాడు. ఇటీవ‌ల అత‌డు త‌న డేటింగ్ లైఫ్ కార‌ణంగా వార్త‌ల్లోకొచ్చాడు. అతడు ఐరిష్ స్నేహితురాలు సోఫీ షైన్ తో డేటింగ్ లో త‌ల‌మునక‌లుగా ఉన్నాడ‌ని క‌థ‌నాలొస్తున్నాయి. అంతేకాదు త‌న ప్రియురాలితో అత‌డు ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ లోను సంద‌డి చేయ‌డం చ‌ర్చ‌గా మారింది.

తాజాగా షేర్ చేసిన క్లిప్‌లో ధావన్ - షైన్ పంజాబీ సాంప్రదాయ దుస్తులను ధరించి, సరదాగా సరదాగా మాట్లాడుకుంటూ క‌నిపించారు. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ.. ఒక‌రంటే ఒక‌రికి ఉన్న‌ ఆప్యాయత అభిమానుల దృష్టిని ఆకర్షించింది. ధావన్ స్వ‌యంగా త‌న ఇన్ స్టాలో దీనిని షేర్ చేసి తన ట్రేడ్‌మార్క్ ఫ్లెయిర్‌తో రీల్‌కు క్యాప్షన్ ఇచ్చాడు. ``గబ్బర్ తిరిగి వచ్చాడు`` అనేది క్యాప్ష‌న్. ధావ‌న్ తో షైన్ బంధం మ‌రింత బ‌ల‌ప‌డిందని దీనిని బ‌ట్టి అర్థమ‌వుతోంది.

ఇటీవలి మీడియా కాన్ క్లేవ్ - ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో జంట‌గా క‌నిపించిన‌ తర్వాత ఇప్పుడు ఈ వీడియో బయటపడింది. దీనిలో ధావన్ తాను మళ్ళీ డేటింగ్ చేస్తున్నానని ఒప్పుకుంటూ ``అవును, నేను ముందుకు సాగాను... ఇది నాకు ఒక ప్రాక్టీస్`` అని అన్నాడు. మళ్ళీ ప్రేమించడానికి సిద్ధంగా ఉన్నారా? అని షైన్ ప్ర‌శ్నించ‌గా, అత‌డు న‌వ్వులు చిందిస్తూ.. నేను ఎప్పుడూ ప్రేమలో ఉంటాను! అని అన్నాడు. లిమెరిక్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి మార్కెటింగ్ , మేనేజ్‌మెంట్ నేపథ్యం కలిగిన ఐరిష్ ఉత్పత్తి సలహాదారు సోఫీ షైన్, ప్రస్తుతం అబుదాబిలోని నార్తర్న్ ట్రస్ట్ కార్పొరేషన్‌లో రెండవ ఉపాధ్యక్షురాలిగా పనిచేస్తున్నారు. రీల్ వైరల్ అవుతుండటంతో, అభిమానులు ధావన్ కొత్త అధ్యాయం ప్రారంభించినందుకు శుభాకాంక్ష‌లు చెబుతున్నారు.