Begin typing your search above and press return to search.

ప్రియురాలితో రొమాంటిక్ పోస్ట్ పంచుకున్న శిఖర్ ధావన్.. క్యాప్షన్ తో అనుమానాలు పెంచుతూ!

అయితే ఇప్పుడు మరొక రొమాంటిక్ పోస్ట్ పంచుకుంటూ ఊహించని క్యాప్షన్ జోడించారు శిఖర్ ధావన్.

By:  Tupaki Desk   |   4 Aug 2025 1:25 PM IST
Shikhar Dhawan New Girlfriend
X

టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ తన భార్యకు విడాకులు ఇచ్చిన తర్వాత ఒక అమ్మాయితో ప్రేమలో ఉన్నారు అంటూ చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. దీంతో గత రెండు నెలల క్రితం ఈ వదంతులను నిజం చేశారు శిఖర్ ధావన్. తన ప్రియురాలి ఫోటోని పోస్ట్ చేస్తూ "మై లవ్" అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఇందులో తన ప్రియురాలు సోఫీ షైన్ తో దిగిన ఫోటోని పంచుకోవడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేసారు. పైగా ఈ పోస్టుకి సోఫీతో పాటు క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ కూడా లైక్ కొట్టారు. దీంతో త్వరలోనే వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నట్లు ప్రచారం కూడా జరిగింది.

అయితే ఇప్పుడు మరొక రొమాంటిక్ పోస్ట్ పంచుకుంటూ ఊహించని క్యాప్షన్ జోడించారు శిఖర్ ధావన్. తాజాగా సోఫీ తో కలిసి ఉన్న ఫోటోని షేర్ చేశారు శిఖర్ ధావన్. ఆ ఫోటోలలో సోఫీ సెల్ఫీ దిగుతూ ఉండగా.. శిఖర్ ఆమెని చూస్తున్నట్టు ఒక ఫోటోని షేర్ చేశారు.. కింద "ఆమె కళ్ళు ఆ ఫోటో మీద ఉంటే.. నా కళ్ళు ఆమెపై ఉన్నాయి" అంటూ శిఖర్ ఒక రొమాంటిక్ క్యాప్షన్ జోడించడంతో..త్వరలోనే పెళ్లి అంటూ అందరూ కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు మరి కొంతమంది కాస్త భిన్నంగా పోస్టులు పెట్టడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది

ఇకపోతే శిఖర్ ధావన్ అభిమానులు ఈ జంటపై ప్రశంసలు కురిపిస్తూ.. సంతోషంగా ఉండాలని కోరుకుంటుంటే .. మరికొంతమంది శిఖర్ ధావన్ మొదటి వివాహాన్ని, చట్టపరమైన పోరాటాలను ప్రస్తావిస్తూ.. రెండవ భరణానికి కూడా సిద్ధంగా ఉండు అంటూ చమత్కరిస్తున్నారు. మొత్తానికి అయితే సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ పట్టించుకోకుండా కొత్త జీవితాన్ని మొదలు పెట్టడానికి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.

శిఖర్ ధావన్ కొత్త గర్ల్ ఫ్రెండ్ సోఫీ షైన్ ఎవరు అనే విషయానికి వస్తే.. ఈమె ఐరిష్ ప్రోడక్ట్ కన్సల్టెంట్.. అమెరికన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ నార్తర్న్ ట్రస్ట్ కార్పొరేషన్ లో వైస్ ప్రెసిడెంట్ గా కూడా పనిచేస్తోంది. ఇక వీరి మధ్య యూఏఈలో పరిచయం ఏర్పడి, అది స్నేహంగా మారి ఇప్పుడు ప్రేమ చిగురించినట్లు సమాచారం.

శిఖర్ ధావన్ మొదటి వివాహ విషయానికి వస్తే.. ఇండియన్ - ఆస్ట్రేలియన్ మాజీ కిక్ బాక్సర్, ఎంట్రప్రెన్యూర్ ఆయేషా ముఖర్జీతో వివాహం జరిగింది. కానీ 2021లో వీరు విడిపోయారు. 2023 అక్టోబర్ 5న విడాకులు మంజూరయ్యాయి. 2024 ఆగస్టులో క్రికెట్కి రిటైర్మెంట్ ప్రకటించారు శిఖర్ ధావన్.. ఇక అప్పటి నుంచి కొన్ని లీగ్ లలో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ కెరియర్ సాగిస్తున్నారు.