శిఖర్ ధావన్‌కి గూగ్లీ విసిరిన విదేశీ బ్యూటీ
భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ మరోసారి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మతి చెడే అందంతో కవ్విస్తున్న విదేశీ బ్యూటీ విసిరిన గూగ్లీ కి అతడి వికెట్ నేలకూలింది.
By: Tupaki Desk | 4 April 2025 8:55 AM ISTభారత మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ మరోసారి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మతి చెడే అందంతో కవ్విస్తున్న విదేశీ బ్యూటీ విసిరిన గూగ్లీ కి అతడి వికెట్ నేలకూలింది. భార్య ఈషా ముఖర్జీ నుండి విడాకులు తీసుకున్నప్పటి నుండి ధావన్ బోయ్ లవ్ లైఫ్ ప్రజల దృష్టిని ఆకర్షిస్తూనే ఉంది. అతడు ఇప్పుడు ఓ విదేశీ యువతితో డేటింగ్ లో ఉన్నాడనేది వేడెక్కించే వార్త.
ఇటీవల దుబాయ్‌లో జరిగిన ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్‌కు హాజరైనప్పుడు అందరి దృష్టిని ఆకర్షించిన ఒక సీక్రెట్ గాళ్ తో ధావన్ ప్రేమాయణం సాగిస్తున్నాడంటూ పుకార్ మొదలైంది. ఇది ఎంతగా దాచేందుకు ప్రయత్నించినా దాగలేదు. ఆ యువతితో ధావన్ వైరల్ వీడియో ఊహాగానాలకు దారితీసింది. ఆ ఇద్దరూ కలిసి కనిపించడం ఇదే మొదటిసారి కాదు. గత సంవత్సరం నవంబర్‌లోను జతగా కనిపించారు. ఆ తర్వాత వారి బంధం గురించి చాలా గుసగుసలు మొదలయ్యాయి. ధావన్ ఇప్పుడు తన భాగస్వామి పేరును వెల్లడించకుండానే తన రిలేషన్ ని పరోక్షంగా ధృవీకరించాడు.
స్నేహితురాలి పేరు చెప్పండి! అని ఎవరైనా అడిగితే, ఆ ప్రశ్నను తప్పించుకుంటూ... నేను ఏ పేరు చెప్పను.. కానీ అత్యంత అందమైన అమ్మాయి నా స్నేహితురాలు! అని ధావన్ చెబుతున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో ధావన్‌తో పాటు కనిపించిన ఆ అందగత్తె చుట్టూ కెమెరాలు ఫోకస్ చేసాయి. ఆ యువతి సోఫీ షైన్ అని మీడియాలో కథనాలొచ్చాయి. సోఫీ షైన్ ఐర్లాండ్‌లో నివసించే ఒక ప్రొఫెషనల్. శిఖర్ ధావన్ ఆమెను ఇన్‌స్టాగ్రామ్‌లో అనుసరిస్తుంది. ఆమె ప్రొఫైల్ ప్రైవేట్‌గా ఉంటుంది. సోఫీ తన వ్యక్తిగత జీవితాన్ని రివీల్ చేయడంలేదు. తను ప్రొడక్ట్ కన్సల్టెంట్‌గా పనిచేస్తుందని టాక్. అయితే ఈ జంట తమ మధ్య రిలేషన్ ని అధికారికంగా ఇంకా ధృవీకరించలేదు.
అక్టోబర్ 2023లో ఈషా ముఖర్జీ నుండి విడాకులు తీసుకున్న శిఖర్ ధావన్.. తన కొడుకు కస్టడీని కోల్పోయాడు. అతడికి సందర్శన హక్కులు, వీడియో కాల్స్ అనుమతించినా కానీ.. కుమారుడు జోరావర్‌ను చూడకుండా లేదా మాట్లాడకుండా చేయడం చర్చనీయాంశమైంది.
