Begin typing your search above and press return to search.

ధావ‌న్ 70కోట్ల ఖ‌రీదైన అపార్ట్‌మెంట్‌!

అపార్ట్‌మెంట్ ధర రూ.65.61 కోట్లుగా ఉంద‌ని పత్రాలు సూచిస్తున్నా, అన్ని ఖ‌ర్చులు క‌లుపుకుని ఇంత పెద్ద మొత్తం వెచ్చించాడు.

By:  Tupaki Desk   |   21 May 2025 11:49 AM IST
ధావ‌న్ 70కోట్ల ఖ‌రీదైన అపార్ట్‌మెంట్‌!
X

ఇటీవ‌ల భార‌త క్రికెట‌ర్ శిఖర్ ధావన్ పేరు చాలా కార‌ణాల‌తో మీడియా హెడ్ లైన్స్ లో కొస్తోంది. అత‌డు శ్రీ‌లంక‌న్ బ్యూటీ జాక్విలిన్ ఫెర్నాండెజ్ తో ఓ సింగిల్ సాంగ్ లో న‌టించాడు. అంత‌కుముందే విదేశీ ప్రియురాలితో ఇన్ స్టా వీడియోలు, ఫోటోల‌ను షేర్ చేస్తూ నిరంత‌రం మీడియా హెడ్ లైన్ లోకొచ్చాడు. ఇప్పుడు ఏకంగా 70 కోట్ల ఖ‌రీదైన అల్ట్రా ల‌గ్జ‌రీ అపార్ట్ మెంట్ కొనుగోలుతో మ‌రోసారి సంచ‌ల‌నం సృష్టించాడు. గురుగ్రామ్‌లో డిఎల్ఎఫ్‌ ది డహ్లియాస్‌లో రూ.69 కోట్లకు లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేసాడ‌ని తెలుస్తోంది. ఆ మేర‌కు రియ‌ల్ ఎస్టేట్ ఎన‌లిటిక్స్ ఫ‌ర్మ్స్ నివేదిక‌ను అందించాయి.

ఈ సూపర్-లగ్జరీ అపార్ట్‌మెంట్ 6,040 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. గురుగ్రామ్‌లోని సెక్టార్ 54లోని డిఎల్.ఎఫ్‌5 గోల్ఫ్ లింక్స్‌లోని ది డహ్లియాస్‌లో ఉంది. ఫిబ్రవరి 2025 మొదటి వారంలో దీనిని రిజిస్టర్ చేసారు. దీనికోసం ధావన్ రూ.3.28 కోట్ల స్టాంప్ డ్యూటీని చెల్లించాడు. అంటే సుమారు 70 కోట్లు ఖ‌ర్చు చేసాడు. అపార్ట్‌మెంట్ ధర రూ.65.61 కోట్లుగా ఉంద‌ని పత్రాలు సూచిస్తున్నా, అన్ని ఖ‌ర్చులు క‌లుపుకుని ఇంత పెద్ద మొత్తం వెచ్చించాడు. కార్పెట్ ఏరియాలో ఉన్న అపార్ట్‌మెంట్ చదరపు అడుగు ధర సుమారు 1.5ల‌క్ష‌లు.

సూపర్ ఏరియాలో రూ. 1.08ల‌క్ష‌లు. ఈ డీల్ భారతదేశంలో అత్యంత ఖరీదైన వాటిలో ఒకటి. ఇండియాలో ల‌గ్జ‌రీ అపార్ట్ మెంట్ల‌ను విక్ర‌యించే దహ్లియాస్, గురుగ్రామ్‌లోని డిఎల్‌ఎఫ్ ఫేజ్-5లోని గోల్ఫ్ కోర్స్ రోడ్‌లో లగ్జరీ వెంచర్ ది కామెల్లియాస్ సమీపంలో ఉంది. 17 ఎకరాల్లో రియ‌ల్ వెంచ‌ర్ ని రెడీ చేస్తోంది. 29 అంత‌స్తులు, ఎనిమిది టవర్లలో దాదాపు 420 సూపర్-లగ్జరీ నివాసాలను డిఎల్ఎఫ్‌ అందిస్తుంది. డిఎల్‌ఎఫ్ మొదటి దశలో 173 ఫ్లాట్‌లను విడుదల చేసింది. అవన్నీ అమ్ముడయ్యాయి. గతంలో డిఎల్‌ఎఫ్ దహ్లియాస్‌లో రెండు పెంట్‌హౌస్‌లను ఒక్కొక్కటి రూ. 150 కోట్లకు విక్రయించిందని క‌థ‌నాలొచ్చాయి.

టీమిండియా క్రికెట‌ర్ శిఖర్ ధావన్ గత సంవత్సరం అంతర్జాతీయ, దేశీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు. తన దేశానికి ప్రాతినిధ్యం వహించాలనే తన కలను సాకారం చేసుకున్నందుకు తన కెరీర్‌తో సంతృప్తి చెందుతున్నానని చెప్పాడు. ప్ర‌స్తుతం విరామ స‌మ‌యాన్ని ప్రియురాలితో ఆస్వాధన‌లో మునిగి తేల్తున్నాడు. ఈ ఖ‌రీదైన అపార్ట్‌మెంట్ ని ప్రియురాలికి కానుకిచ్చాడా? అంటూ అభిమానులు ప్ర‌శ్నిస్తున్నారు.