Begin typing your search above and press return to search.

50 వ‌య‌సులో ఎత్తుమ‌డ‌మ‌ల‌తో హిప్ చూపించింది

స్టైల్ ఐకాన్ ప్రస్తుతం పాపుల‌ర్ డ్యాన్స్ రియాలిటీ షో `ఝలక్ దిఖ‌లాజా`కి న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు.

By:  Tupaki Desk   |   19 Nov 2023 11:30 AM GMT
50 వ‌య‌సులో ఎత్తుమ‌డ‌మ‌ల‌తో హిప్ చూపించింది
X

బాలీవుడ్ హాట్ గాళ్ మలైకా అరోరా ఖాన్ 50 వయసులోను యువ‌త‌రంలో స్ఫూర్తి నింపే ఫ్యాష‌నిస్టాగా వెలిగిపోతోంది. పరిశ్రమలో ఫిటెస్ట్ బ్యూటీగా మ‌లైకా పేరు మార్మోగుతోంది. దీనికోసం మ‌లైకా జిమ్ యోగా అంటూ ఎంతో శ్ర‌మిస్తుంది. స్టైల్ ఐకాన్ ప్రస్తుతం పాపుల‌ర్ డ్యాన్స్ రియాలిటీ షో `ఝలక్ దిఖ‌లాజా`కి న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు.


తాజాగా మలైకా అరోరా బాడీకాన్ థై స్లిట్ గౌనులో కెమెరా కంటికి చిక్కింది. ఇటీవ‌ల‌ మ‌లైకా డ్యాన్స్ రియాలిటీ షో సెట్స్‌లో అద్భుత‌మైన లుక్ లో క‌నిపించింది. థై స్లిట్ సీ-త్రూ బాడీకాన్ గౌనులో మ‌లైకా లుక్ ఎంతో స్పెష‌ల్ గా ఆక‌ర్షించింది. హైహీల్స్ ధరించిన మ‌లైకా పొడవాటి గౌను ఎత్తు మడమల మధ్య ఇరుక్కుపోవడంతో జారిప‌డ‌బోయింది. కానీ అంత‌లోనే నిల‌దొక్కుకుంది. అయితే మ‌లైకాపై నెటిజనులు ర‌క‌ర‌కాల కామెంట్లు చేస్తున్నారు. మ‌ల్లా లోదుస్తులు ధరించలేదని, ప‌బ్లిక్ లో ఇలా క‌నిపిస్తుందా? అంటూ నెటిజనుల్లో ఒక వర్గం నిందించారు.

అయితే అటువంటి దుస్తుల కోసం తార‌లు సాధారణంగా థాంగ్స్‌ను ఎంచుకుంటారనే విష‌యం చాలామందికి తెలియదు. ఇవి రొటీన్ కి భిన్న‌మైన‌వి. ఇన్న‌ర్ లు ఏవీ ఉండవు. కార‌ణం ఏదైనా మ‌లైకా ఎంపిక‌ను కొంద‌రు త‌ప్పు ప‌ట్టారు. మలైకా హాట్ అవ‌తార్ పై నెటిజన్లు క్రూరంగా ట్రోల్ చేస్తున్నారు.

ఒక నెటిజ‌న్ ఈ ఫోటోలు వీక్షించాక‌ `అంత అసభ్యంగానా..`` అని ప్ర‌శ్నించాడు. మరొకరు, `ఆమె లోదుస్తులు ధరించలేదా?` అని కామెంట్ చేసారు. మూడ‌వ వ్య‌క్తి ``ఆమె ఎప్పుడూ అనుచితంగా ఎందుకు ఇలాంటి దుస్తులు ధరిస్తుంది?`` అని ప్ర‌శ్నించారు.

మలైకా అరోరా దీపావళి వేడుకలు

ఇటీవ‌ల‌ దీపావళి పండ‌గ‌లో మలైకా స‌ల్వార్ క‌మీజ్ లో ఎంతో ట్రెడిష‌న‌ల్ గా క‌నిపించింది. తన తల్లిదండ్రులు, సోదరి అమృతా అరోరా, పిల్లలతో క‌లిసి పోజులిచ్చిన ఫోటోను మ‌లైకా ఇన్ స్టాలో షేర్ చేసారు. ఈ ఫోటోలో మలైకా ఎరుపు రంగు సల్వార్ కమీజ్ - పెర్ల్ చోకర్ ధరించి కనిపించింది. తన కుటుంబంతో పోజులిచ్చేటప్పుడు నుదుటిపై తిలకం పెట్టుకుని కనిపించింది. ఫోటోను షేర్ చేస్తూ మలైకా ఇలా రాసింది ``శుభ దీపావళి`` అంటూ లైట్నింగ్ ఈమోజీల‌ను షేర్ చేసింది. కుటుంబంతో ఆనందంగా దీపావ‌ళిని సెల‌బ్రేట్ చేసుకుంది. మ‌లైకా ప్ర‌స్తుతం రియాలిటీ షోల జ‌డ్జిగా బాగానే ఆర్జిస్తోంది. సోష‌ల్ మీడియాల్లో ప్ర‌క‌ట‌న‌ల‌ను షేర్ చేయ‌డం ద్వారా ఆదాయ ఆర్జ‌న‌లో టాప్ లో ఉంది.