Begin typing your search above and press return to search.

ఆ విషయాన్ని ఓపెన్‌ గా చెప్పేసింది!

ఈ మధ్య కాలంలో బాలీవుడ్‌ సెలబ్రిటీలు వరుసగా యానిమల్‌ సినిమా గురించి మాట్లాడటం, ఆ వ్యాఖ్యలు వైరల్‌ అవ్వడం మనం చూస్తూనే ఉన్నాం.

By:  Tupaki Desk   |   13 Feb 2024 12:30 PM GMT
ఆ విషయాన్ని ఓపెన్‌ గా చెప్పేసింది!
X

కాలా సినిమాతో సౌత్‌ సినీ ప్రేక్షకులకు పరిచయం అయిన ఉత్తరాది ముద్దుగుమ్మ హుమా ఖురేషి సోషల్‌ మీడియాలో తన అందాల ఆరబోత ఫోటోలను షేర్ చేయడం ద్వారా అన్ని వర్గాల ప్రేక్షకులను, అన్ని భాషల ప్రేక్షకులను మెప్పిస్తున్న విషయం తెల్సిందే.


తాజాగా ఈ అమ్మడు ఒక ఇంటర్వ్యూలో యానిమల్‌ సినిమా పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ మధ్య కాలంలో బాలీవుడ్‌ సెలబ్రిటీలు వరుసగా యానిమల్‌ సినిమా గురించి మాట్లాడటం, ఆ వ్యాఖ్యలు వైరల్‌ అవ్వడం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు హుమా ఖురేషి వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

యానిమల్ సినిమా చూస్తున్నప్పుడు పూల్స్ ఆఫ్ వాల్ స్ట్రీట్‌ వంటి భారీ చిత్రాన్ని చూస్తున్న ఫీల్‌ కలిగిందని హుమా ఖురేషి పేర్కొంది. యానిమల్ ఒక భిన్నమైన కథా చిత్రం. కథ మరియు కథనం, సంగీతం నాకు చాలా బాగా నచ్చాయి. సినిమాను ఎంజాయ్ చేస్తూ చూశాను.

ఒక నటిగా అలాంటి సినిమాలో నటించాలి అన్నది నా కోరిక. అన్ని రకాల పాత్రలు చేయడం ద్వారా నటిగా సంతృప్తి లభిస్తుంది. ప్రేక్షకులకు ఎలాంటి సినిమాలు చూడాలి అనే విషయమై స్పష్టత ఉంటుంది. ఏ సినిమా చేసినా ప్రశంసలతో పాటు విమర్శలు కూడా వస్తాయి.

కనుక యానిమల్ వంటి సినిమాలు రావాలి. అలాంటి సినిమాలో నేను నటించాలి అని కోరుకుంటున్నాను అంటూ ఆసక్తికర వ్యాఖ్యలను హుమా ఖురేషి చేయడం అందరిని ఆశ్చర్యపరిచింది. సినిమాల వల్ల సమాజం ప్రభావితం అవుతుందని నేను అనుకోవడం లేదని కూడా కాలా బ్యూటీ వ్యాఖ్యలు చేసింది.

మొత్తానికి వైల్డ్‌ పాత్రలో, హింసాత్మక కంటెంట్‌ ఓరియంటెడ్‌ చిత్రంలో నటించేందుకు తనకు ఎలాంటి ఇబ్బంది లేదు అంటూ హుమా ఖురేషి ఓపెన్ గా చెప్పింది. మరి అలాంటి కంటెంట్‌, పాత్ర తో ఈ అమ్మడిని ఎవరైనా సంప్రదిస్తారా అనేది చూడాలి.