లక్షల్లో ఎగవేసారని శృంగార నటి లబోదిబో
హైదరాబాదీ అమ్మాయి కోటి కలలతో ముంబైలో అడుగుపెట్టింది. అక్కడ అనుకోని పరిస్థితులు ఎదురయ్యాయి.
By: Tupaki Desk | 27 April 2025 8:45 AM ISTహైదరాబాదీ అమ్మాయి కోటి కలలతో ముంబైలో అడుగుపెట్టింది. అక్కడ అనుకోని పరిస్థితులు ఎదురయ్యాయి. గాడ్ ఫాదర్ లేని చోట నటిగా ఎదగాలంటే చాలా వేధింపులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. బాలీవుడ్ లో తనకు అలాంటి పరిస్థితులు ఎదురయ్యాయని ఈ నటి గతంలో వెల్లడించింది. కానీ తప్పదు.. కాలగమనంలో చాలా రాజీపడాల్సి వచ్చిందని అంగీకరించింది. ప్రతిభతో కొన్నేళ్ల పాటు నటనలో కొనసాగి చివరికి శృంగార సినిమాల్లోను నటించాల్సిన వచ్చింది. నిజానికి అందం, ప్రతిభ కంటే ఇండస్ట్రీలో తన స్థాయిని, స్థానాన్ని నిర్ధేశించే ఇంకా ఎన్నో విషయాలు ఉంటాయని ఈ నటి లైఫ్ నిరూపించింది.
ప్రస్తుతం సోషల్ మీడియాల్లో తన గోడు వెల్లబోసుకుంటున్న ఈ బ్యూటీ పేరు షెర్లిన్ చోప్రా. అందరికీ సుపరిచితమైన నటి. టాలీవుడ్ బ్లాక్ బస్టర్ `ఏ ఫిలిం బై అరవింద్`లో తనదైన అందం, నట ప్రతిభతో కట్టి పడేసిన షెర్లిన్ ఆ తర్వాత కెరీర్ స్ట్రగుల్ నుంచి బయటపడేందుకు చాలా సాహసాలు చేసింది. ముఖ్యంగా హిందీ సినీపరిశ్రమలో రాణించాలనే తన కలను నెరవేర్చుకోలేకపోయింది.
ఇటీవల ఈ బ్యూటీ శృంగార చిత్రాలకు పరిమితమైంది. అయితే షెర్లిన్ తనకు జరిగిన ఒకానొక మోసం గురించి బహిరంగంగా వెల్లడించింది. తనతో మూడు శృంగార చిత్రాలు తీసి చెల్లించాల్సిన 48లక్షల పారితోషికాన్ని చిత్రనిర్మాత ఎగవేసాడని షెర్లిన్ ఆరోపించింది. అమ్మాయిలతో డర్టీ పని చేయమని బలవంతం చేసి, చివరికి డబ్బు ఎగవేసారని, నైతికత టాటాల్ని చూసి నేర్చుకోవాలని షెర్లిన్ వ్యాఖ్యానించింది. డబ్బు అడిగినందుకు బెదిరించారని కూడా వాపోయింది.
టాటాలు నిజాయితీగా వ్యాపారం చేస్తారు. కానీ ఇక్కడ నిర్మాతలు కళాకారులను బెదిరిస్తారని అంది. పూర్తిగా తన బకాయి వసూలు చేసే వరకూ సదరు నిర్మాతను వదిలిపెట్టేది లేదని కూడా షెర్లిన్ వార్నింగ్ ఇచ్చింది. చెల్లించకుండా ఎగ్గొట్టిన పెండింగ్ పేమెంట్ 48 లక్షలు ఎలా అయినా వసూలు చేస్తానని షెర్లిన్ శపథం చేసింది. తనకు దుర్గామాత ఆశీస్సులు ఉన్నాయని కూడా ఈ సందర్భంగా తెలిపింది.
