నాకు అమితాబ్, షారుక్ తో పన్లేదు
రీసెంట్ గా జరిగిన వేవ్స్2025 సమ్మిట్ ఎంతో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 5 May 2025 1:00 AM ISTరీసెంట్ గా జరిగిన వేవ్స్2025 సమ్మిట్ ఎంతో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ సమ్మిట్ కు టాలీవుడ్, బాలీవుడ్ నుంచి పలువురు సినీ సెలబ్రిటీలు హాజరవగా, అందులో ప్రముఖ డైరెక్టర్ శేఖర్ కపూర్ కూడా ఉన్నారు. ఈ హై ఎనర్జీ సమ్మిట్ లో శేఖర్ కపూర్ చేసిన సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్ లాంటి బాలీవుడ్ లెజెండ్స్ ను ఏఐ జెనరేటెడ్ సూపర్ స్టార్ లుగా మార్చడానికి తాను రెడీగా ఉన్నానని శేఖర్ కపూర్ అన్నారు. యాక్టర్లు యాక్టర్లలానే ఉంటారని, కానీ ఏఐ నెక్ట్స్ జెనరేషన్ స్టార్లను రెడీ చేస్తుందని అయన తెలిపారు. దాని కోసం తనకు అమితాబ్ బచ్చన్ అవసరం లేదని తనే సొంత క్యారెక్టర్ ను సృష్టిస్తానని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
తనకు షారుఖ్ ఖాన్ కూడా అవసరం లేదని, తన సొంత స్టార్ ను తానే సృష్టించుకుంటానని, దానికి కాపీ రైట్ కూడా తన వద్ద ఉంటుందని శేఖర్ కపూర్ అన్నారు. ఏఐ కేవలం మానవ ప్రదర్శనలను ప్రతిబింబించదని, అది వాటిని అధిగమిస్తుందని కపూర్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించగా, ఆయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
