స్టార్ డైరెక్టర్ నేల విడిచి సాము చివరికిలా
అవార్డులు రివార్డులతో పాటు కమర్షియల్ సినిమాని తెరకెక్కించగల ఘనుడిగాను పేరు తెచ్చుకున్నారు. కానీ ఆయన సంపాదనలో జీరో అయ్యారు. ఎంతగా అంటే.. చివరికి స్నేహితుల ఇంటి సోఫాలో నిదురించాల్సిన పరిస్థితిని తెచ్చుకున్నారు.
By: Tupaki Desk | 18 April 2025 10:04 AM ISTఅతడు చిత్రసీమలోని అత్యుత్తమ దర్శకులలో ఒకరు. తీసినవి కొన్ని సినిమాలే అయినా అవన్నీ క్లాసిక్స్ గా నిలిచాయి. అతడు తెరకెక్కించిన క్లాసిక్స్ ఇప్పటికీ స్క్రీన్ ప్లే పాఠాలుగా చిత్రపరిశ్రమకు చాలా నేర్పుతున్నాయి. భారతదేశంలో క్లాసిక్ హిట్స్ అనదగ్గ చిత్రాలను తెరకెక్కించిన అతడు ఉన్నట్టుండి హాలీవుడ్ కి వెళ్లిపోయాడు. అక్కడ ప్రయోగాలు చేసాడు. తన సినిమాకి ఆస్కార్ నామినేషన్లు దక్కాయి. అవార్డులు రివార్డులతో పాటు కమర్షియల్ సినిమాని తెరకెక్కించగల ఘనుడిగాను పేరు తెచ్చుకున్నారు. కానీ ఆయన సంపాదనలో జీరో అయ్యారు. ఎంతగా అంటే.. చివరికి స్నేహితుల ఇంటి సోఫాలో నిదురించాల్సిన పరిస్థితిని తెచ్చుకున్నారు.
ఆయన మరెవరో కాదు.. ది గ్రేట్ శేఖర్ కపూర్. బాలీవుడ్ సీనియర్ దర్శకుడిగా అతడికి గొప్ప గౌరవం, ఆదరణ ఉన్నాయి. కానీ ఆయన సరైన సమయంలో సరైన కమర్షియల్ సినిమాలు చేయకుండా, పూర్తిగా ప్రయోగాల బాటను అనుసరించడం కెరీర్ డౌన్ ఫాల్ కి కారణమైంది. ఒక రకంగా అతడు సినిమాలు ఎక్కువగా చేయకపోవడం, కేవలం అవార్డు సినిమాలకే అంకితమవ్వడం కూడా పేదరికంలోకి నెట్టింది.
శేఖర్ కపూర్ బాలీవుడ్ క్లాసిక్ హిట్ చిత్రాలు మసూమ్, మిస్టర్ ఇండియాలకు దర్శకత్వం వహించారు. ఆ తర్వాత బాండిట్ క్వీన్ (పూలన్ దేవి స్టోరి) అనే నిజ జీవితకథను తెరపైకి తెచ్చారు. కానీ ఈ సినిమా వివాదాస్పదం కావడంతో ఇండియాలో రిలీజ్ కాలేదు. ఆ తర్వాత అతడు హాలీవుడ్ బాట పట్టారు. అక్కడ ఎలిజబెత్ కథతో సినిమా తీసారు. దీనికి ఏడు ఆస్కార్ నామినేషన్లు దక్కాయి. అటుపైనా శేఖర్ కపూర్ 2022లో హాలీవుడ్ సినిమాని తెరకెక్కించారు. కానీ మారుతున్న కాలంతో పాటు ఆయనలో మార్పు లేదు. కమర్షియల్ ఆలోచనలు అసలే లేవు. ఇప్పటితరం కేవలం కమర్షియల్ వాసనలతో మాస్ ని థియేటర్లకు రప్పిస్తూ ఎన్ క్యాష్ చేసుకుంటున్నారు. కానీ దిగ్ధర్శకుడు శేఖర్ కపూర్ అలాంటి ప్రయత్నం చేయకపోవడం శోచనీయం. ఇప్పటికీ దేశంలోని దర్శకులు క్రియేటివిటీ పరంగా రిస్క్ చేయాల్సి ఉంటుందని సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందనే అంటున్నారు.
