Begin typing your search above and press return to search.

కుబేర సైలెన్స్ రీజన్ ఏంటి..?

కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వస్తున్న సినిమా కుబేర. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్.ఎల్.పి, అమిగోస్ క్రియేషన్స్ కలిసి నిర్మిస్తున్నారు

By:  Tupaki Desk   |   11 April 2025 8:00 AM IST
కుబేర సైలెన్స్ రీజన్ ఏంటి..?
X

కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వస్తున్న సినిమా కుబేర. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్.ఎల్.పి, అమిగోస్ క్రియేషన్స్ కలిసి నిర్మిస్తున్నారు. ధనుష్ కుబేర సినిమా విషయంలో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాలో మన కింగ్ నాగార్జున స్పెషల్ రోల్ లో నటిస్తున్నారు. సినిమాలో ఆయన రోల్ ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుందని అంటున్నారు. కుబేర సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్న నటిస్తుంది.

శేఖర్ కమ్ముల తన సినిమాను చాలా సైలెంట్ గా పూర్తి చేస్తారు. అదే తరహాలో కుబేర సినిమాను కూడా చకచకా చేస్తున్నారు. ఐతే సినిమాను ఈ సమ్మర్ రిలీజ్ చేస్తారని అనుకోగా అది జరగలేదు. ఆమధ్య కుబేర సినిమా జూన్ 20న రిలీజ్ అని చెప్పారు. కానీ అందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది. కుబేర సినిమా ఎంతవరకు వచ్చిందన్నది తెలియట్లేదు.

కుబేర నుంచి ఆమధ్య ఒక టీజర్ రాగా అది ఇంప్రెస్ చేసింది. నెక్స్ట్ సినిమా నుంచి జస్ట్ పోస్టర్స్ వదిలారు తప్ప ఎలాంటి అప్డేట్స్ ఇవ్వలేదు. కుబేర సినిమా టీం ఈ సైలెన్స్ వెనక రీజన్స్ ఏంటన్నది తెలియాల్సి ఉంది. జూన్ 20 రిలీజ్ అనుకున్నారు సినిమా ఆ టైం కు తీసుకొస్తారా లేదా రిలీజ్ డేట్ ఏమైనా మారుతుందా అన్నది తెలియాల్సి ఉంది. ఈమధ్య ఎంత పెద్ద స్టార్ సినిమా అయినా కూడా ఎప్పటికప్పుడు ప్రమోషనల్ కంటెంట్ తో అలరిస్తేనే సినిమా మీద ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుందని తేలింది.

అందుకే జూన్ రిలీజ్ ఉంటుందా లేదా అన్నది పక్కన పెడితే ప్రేక్షకులు కుబేర సినిమాకు ఎంగేజ్ అవ్వాలంటే ఏదో ఒక అప్డేట్ ఇవ్వాలి. అలా కాకుండా సినిమా సైలెంట్ గా ఉంటే కష్టమవుతుంది. కుబేర సినిమా విషయంలో ఆడియన్స్ లో బజ్ పెంచాలంటే ప్రమోషన్స్ మొదలు పెట్టాలి. జూన్ లో రిలీజ్ అంటే అప్పుడు ప్రమోషన్స్ చూద్దాం అన్నట్టు కాకుండా పోస్టర్స్, సాంగ్స్ రిలీజ్ తో సినిమాను ఆడియన్స్ కు కనెక్ట్ చేస్తే సినిమాకు హెల్ప్ అవుతుంది. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించడం కూడా ఒక ప్లస్సే అని చెప్పొచ్చు. ధనుష్ నాగార్జున రష్మిక ఇలాంటి స్టార్స్ ని సినిమాలో పెట్టుకుని కుబేర సినిమా గురించి ఇప్పటివరకు ఎలాంటి బజ్ లేకపోవడం సినీ ప్రియులను నిరాశపరుస్తుంది.