Begin typing your search above and press return to search.

అఖిరా డెబ్యూ.. కమ్ముల గాయాన్ని మర్చిపోలేదా?

టాలీవుడ్‌లో మెగా వారసుల ఎంట్రీపై ఉండే ఆ వైబ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

By:  Tupaki Desk   |   10 Feb 2026 12:31 PM IST
అఖిరా డెబ్యూ.. కమ్ముల గాయాన్ని మర్చిపోలేదా?
X

టాలీవుడ్‌లో మెగా వారసుల ఎంట్రీపై ఉండే ఆ వైబ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందులోనూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అఖిరా నందన్ వెండితెర అరంగేట్రం కోసం ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సోషల్ మీడియాలో అఖిరాకు సంబంధించిన ఏ చిన్న వీడియో వచ్చినా అది నిమిషాల్లో వైరల్ అవుతోంది. అయితే ఇప్పుడు ఈ డెబ్యూ వెనుక వినిపిస్తున్న ఒక దర్శకుడి పేరు మాత్రం ఫిల్మ్ నగర్ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఆ పేరు వినగానే పాత కాంట్రవర్సీలు మళ్ళీ తెరపైకి వస్తున్నాయి.

సినిమా ఇండస్ట్రీలో అభిప్రాయ భేదాలు ఉండటం చాలా కామన్. ఎంతో మంది దర్శకులు, నటులు కెరీర్ మొదట్లో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నా, ఆ తర్వాత కలిసి పని చేసిన సందర్భాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ కూడా పాలిటిక్స్ వేరు సినిమాలు వేరు అని నమ్మే వ్యక్తి. తనను ఎంతగానో విభేదించే ప్రకాష్ రాజ్‌ను 'వకీల్ సాబ్' సినిమాలో విలన్‌గా తీసుకున్నప్పుడే పవన్ మెచ్యూరిటీ ఏంటో అందరికీ అర్థమైంది. కానీ ఈసారి వినిపిస్తున్న కాంబినేషన్ మాత్రం ఫ్యాన్స్‌కు అంత ఈజీగా మింగుడు పడటం లేదు.

అసలు విషయంలోకి వస్తే అఖిరా నందన్ డెబ్యూ మూవీని హ్యాండిల్ చేయమని కొందరు నిర్మాతలు క్లాస్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దగ్గరకు వెళ్లినట్లు ఇండస్ట్రీలో ఒక టాక్ మొదలైంది. శేఖర్ కమ్ముల అంటేనే సెన్సిబుల్ కథలకు పెట్టింది పేరు. అయితే గతంలో పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో కమ్ముల చేసిన కొన్ని ఘాటు వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద దుమారం రేపాయి. కూటమిలతో కలవడం కరెక్ట్ కాదు అనేలా చేసిన సోషల్ మీడియా పోస్టులు పెద్ద దుమారమే రేపాయి.

ఆ కామెంట్స్ వల్ల పవన్ ఫ్యాన్స్ ఇప్పటికీ కమ్ముల మీద కాస్త అసహనంతోనే ఉన్నారు. పవన్ కూడా ఆ కామెంట్స్ కు సమాధానం కూడా ఇచ్చారు. ఇక్కడ పరిస్థితులు ఏసీలో కూర్చొని కథలు రాసేవారికి తెలియవు అనేలా కౌంటర్స్ కూడా పడ్డాయి. తాను ఎవరి కామెంట్స్ ని అంత ఈజీగా మర్చిపోనని కూడా పవన్ అనడంతో కమ్ముల ఫ్యాన్స్ లో మరింత నెగిటివ్ అయ్యారు.

ఇప్పుడు అదే దర్శకుడి చేతిలో మెగా వారసుడి బాధ్యత పెడితే ఎలా ఉంటుందనేది హాట్ టాపిక్‌గా మారింది. అలాగే కమ్ముల సినిమాల స్టైల్ చూస్తే అవి చాలా క్లాస్‌గా, మృదువుగా ఉంటాయి. కానీ అఖిరా ఎంట్రీ మాత్రం ఒక హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాతో ఉండాలని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కమ్ముల మార్క్ స్క్రీన్ ప్లేలో అఖిరాను ఒక సాఫ్ట్ రోల్‌లో చూడటం ఫ్యాన్స్‌కు ఇష్టం ఉంటుందా అన్నది పెద్ద డౌట్.

ఒకవేళ పవన్ పాత విషయాలన్నీ మర్చిపోయి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా, సోషల్ మీడియాలో ఇప్పటికీ ఆ పాత గాయాన్ని గుర్తు చేస్తున్న ఫ్యాన్స్‌ను మేకర్స్ ఎలా ఒప్పిస్తారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఏదేమైనా అఖిరా డెబ్యూ గురించి వస్తున్న ఈ రూమర్స్ ఎంతవరకు నిజమో తెలీదు కానీ, సోషల్ మీడియాలో మాత్రం చర్చలు ఓ రేంజ్‌లో జరుగుతున్నాయి. కమ్ముల చేసిన ఆ పాత కామెంట్స్ ఇప్పుడు అఖిరా కెరీర్‌పై ఏమైనా ప్రభావం చూపుతాయా లేదా పవన్ తన పెద్ద మనసుతో అన్నీ సర్దుబాటు చేస్తారా అనేది చూడాలి.