Begin typing your search above and press return to search.

మహేష్ రిఫరెన్స్ తో రాజమౌళి సినిమాలో అతను..!

అందుకే నెక్స్ట్ చేస్తున్న రాజమౌళి సినిమాకు కూడా మహేష్ అతనితో ఒక పాట చేసేలా రాజమౌళికి రికమెండ్ చేస్తున్నాడట.

By:  Tupaki Desk   |   1 Feb 2024 2:45 AM GMT
మహేష్ రిఫరెన్స్ తో రాజమౌళి సినిమాలో అతను..!
X

మహేష్ ఫ్యాన్స్ ఎప్పుడు కూడా సూపర్ స్టార్ కుర్చీ మడతపెట్టే డ్యాన్స్ వేస్తాడని అనుకోలేదు. యాక్షన్ లో కింగ్ అయిన మహేష్ డ్యాన్స్ లో వీక్ అన్న విషయం ఫ్యాన్స్ కూడా ఒప్పేసుకుంటారు. అలాంటి మహేష్ కూడా ఫ్యాన్స్ విన్నపాన్ని మన్నించి డ్యాన్స్ లో దమ్ము చూపిస్తున్నాడు. గుంటూరు కారం సినిమా హిట్ లో మహేష్ డ్యాన్స్ లు మేజర్ పార్ట్ అయ్యాయని చెప్పడంలో డౌట్ అవసరం లేదు.

సరిలేరు నీకెవ్వరు సినిమా నుంచి మహేష్ శేఖర్ మాస్టర్ కాంబో సూపర్ హిట్ అవుతూ వచ్చింది. గుంటూరు కారంలో మాస్ సాంగ్ కూడా సూపర్ హిట్ అవ్వడంతో తన ప్రతి సినిమాలో శేఖర్ మాస్టర్ ని రిపీట్ చేయడం కంపల్సరీ అని పెట్టుకున్నాడు మహేష్. అందుకే నెక్స్ట్ చేస్తున్న రాజమౌళి సినిమాకు కూడా మహేష్ అతనితో ఒక పాట చేసేలా రాజమౌళికి రికమెండ్ చేస్తున్నాడట.

రాజమౌళి సినిమాలో ప్రేం రక్షిత్ మాస్టర్ రెగ్యులర్ కంపోజింగ్ చేస్తుంటాడు. RRR సినిమాలో నాటు నాటు సాంగ్ కి వరల్డ్ వైడ్ గా సెన్సేషన్ సృష్టించాడు ప్రేం రక్షిత్. ఈసారి మహేష్ వల్ల శేఖర్ మాస్టర్ కూడా ఈ ప్రాజెక్టు లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. మహేష్ తో నాటు నాటు లాంటి స్టెప్పు వేయించాలంటే అది శేఖర్ మాస్టర్ వల్లే అవుతుంది. అందుకే జక్కన్న సినిమాకు అతన్ని కూడా తీసుకోబోతున్నారట.

రాజమౌళి మహేష్ కాంబినేషన్ లో వస్తున్న యాక్షన్ అడ్వెంచర్ మూవీని భారీ స్థాయిలో తెరకెక్కించబోతున్నారు. తన ప్రతి సినిమాలానే రాజమౌళి ఈ సినిమాకు కూడా నో కాంప్రమైజ్ అనేస్తున్నాడట. త్వరలోనే సినిమా సెట్స్ మీదకు వెళ్తుండగా అందులో నటించే కాస్టింగ్ గురించి డీటైల్స్ బయటకు రావాల్సి ఉంది. ఈ సినిమాను 2026 ఫస్ట్ హాఫ్ లో రిలీజ్ ప్లాన్ చేసేలా చూస్తున్నారు.

RRR తో కేవలం పాటకే ఆస్కార్ వచ్చేలా చేసిన రాజమౌళి మహేష్ సినిమాతో బెస్ట్ మూవీ, బెస్ట్ డైరెక్టర్ కేటగిరీలు టార్గెట్ పెడుతున్నాడని తెలుస్తుంది. అంతేకాదు తన రెగ్యులర్ సినిమాల్లా 3, 4 ఏళ్లు కాకుండా ఈ సినిమాను కేవలం ఏడాదిలో పూర్తి చేస్తానని అంటున్నాడు రాజమౌళి. అయితే ఏడాదిలో అవసరం లేదు కానీ రెండేళ్లలో అదిరిపోయే బొమ్మ ఇవ్వమని అంటున్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్.