Begin typing your search above and press return to search.

తన స్టైల్ నుంచి బయటకొచ్చిన శేఖర్ కమ్ముల

శేఖర్ కమ్ముల కెరియర్ లో హైయెస్ట్ బడ్జెట్ తో చేస్తోన్న సినిమా ఇదే కావడం విశేషం. ఈ మూవీ కోసం శేఖర్ కమ్ముల తన స్టైల్ నిపూర్తిగా పక్కన పెట్టారు.

By:  Tupaki Desk   |   10 Dec 2023 4:18 AM GMT
తన స్టైల్ నుంచి బయటకొచ్చిన శేఖర్ కమ్ముల
X

టాలీవుడ్ లో శేఖర్ కమ్ముల సినిమా అంటే ఆడియన్స్ లో ఒక అభిప్రాయం ఉంది. డీసెంట్ కథలని, ఎమోషనల్ ఎలిమెంట్స్ లో తెరపై అంతే అందంగా ప్లెజెంట్ గా చూపిస్తూ ఉంటారు. యాక్షన్ సన్నివేశాలకి శేఖర్ కమ్ముల సినిమాలో అస్సలు చోటు ఉండదు. కేవలం డ్రామాతోనే ఆడియన్స్ ని మెప్పిస్తారు. ఓ విధంగా చెప్పాలంటే అతని సినిమాలలో కథ కంటే పాత్రల ప్రయాణం కనిపిస్తుంది.

నిజజీవితంలో చాలా మందికి శేఖర్ కమ్ముల సృష్టించిన పాత్రలని రిలేట్ చేసుకుంటారు. అందుకే ఆయన సినిమాలకి ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు యూత్ కూడా కనెక్ట్ అవుతూ ఉంటారు. ఆనంద్ నుంచి లవ్ స్టొరీ వరకు అన్ని సినిమాలు ఇంచు మించు ఒకే ఫార్మాట్ లో ఉంటాయి. ఎక్కడా బోర్ కొట్టవు. అందుకే శేఖర్ కమ్ముల సినిమాలకి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది.

అయితే శేఖర్ కమ్ముల నెక్స్ట్ ధనుష్ , నాగార్జున కాంబినేషన్ లో మల్టీ స్టారర్ మూవీ చేయబోతున్న సంగతి తెలిసిందే. ధనుష్ 51వ చిత్రంగా ఇది సిద్ధం అవుతోంది. ఇప్పటికే స్పెషల్ పోస్టర్ తో అఫీషియల్ గా ఎనౌన్స్ చేశారు. శేఖర్ కమ్ముల కెరియర్ లో హైయెస్ట్ బడ్జెట్ తో చేస్తోన్న సినిమా ఇదే కావడం విశేషం. ఈ మూవీ కోసం శేఖర్ కమ్ముల తన స్టైల్ నిపూర్తిగా పక్కన పెట్టారు.

పీరియాడికల్ జోనర్ లో మాస్ యాక్షన్ ఎలిమెంట్స్ మిక్స్ చేసిన పొలిటికల్ డ్రామాగా ఈ సినిమా కథని సిద్ధం చేశారు. స్క్రిప్ట్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయిందంట. 1970 బ్యాక్ డ్రాప్ లో మూవీ కథ నడుస్తుందని తెలుస్తోంది. వచ్చేఏడాది మూవీ షూటింగ్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ధనుష్ తెలుగులో చేయబోయే రెండో సినిమా ఇది కావడం విశేషం.

పాన్ ఇండియా లెవల్ లోనే ఈ మూవీని భారీ బడ్జెట్ తో ఏషియన్ గ్రూప్, అమిగోస్ క్రియేషన్స్, శ్రీ వెంకటేశ్వర బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. శేఖర్ కమ్ముల తనకున్న క్లాస్ డైరెక్టర్ ఇమేజ్ నుంచి ఈ చిత్రంతో పూర్తిగా బయటకొచ్చే ప్రయత్నం మాత్రం గట్టిగానే చేస్తున్నారు. మరి ఈ మూవీ ఏ మేరకు అతనికి సక్సెస్ ఇస్తుందనేది చూడాలి.