Begin typing your search above and press return to search.

శేఖర్ కమ్ముల ఆఫర్ ని కాదన్న సాయి పల్లవి..?

ప్రేమంతో సౌత్ లో సూపర్ పాపులర్ అయిన సాయి పల్లవి ఫిదాతో తెలుగు లో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది

By:  Tupaki Desk   |   16 Aug 2023 3:30 PM GMT
శేఖర్ కమ్ముల ఆఫర్ ని కాదన్న సాయి పల్లవి..?
X

ప్రేమంతో సౌత్ లో సూపర్ పాపులర్ అయిన సాయి పల్లవి ఫిదాతో తెలుగు లో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఫిదా సినిమా తో తెలుగు ఆడియన్స్ లో ప్రత్యేకమైన స్థానం ఏర్పరచుకుంది సాయి పల్లవి. అప్పటి నుంచి తన మార్క్ నటనతో అలరిస్తూ వస్తుంది అమ్మడు. తెలుగులో లేడీ పవర్ స్టార్ ఇమేజ్ సంపాదించిన సాయి పల్లవి ప్రత్యేకమైన క్రేజ్ ఏర్పరచుకుంది. సాయి పల్లవి సినిమాలో ఉంది అంటే ఆ సినిమా సంథింగ్ స్పెషల్ అనిపించేలా పాపులర్ అయ్యింది.

కేవలం రెమ్యునరేషన్ కోసమో లేదా ఇమేజ్ కోసమో ఆమె సినిమాలు చేయదు. కథ నచ్చకపోతే.. తన క్యారెక్టర్ కి సూట్ కాకపోతే నిర్మాతలు ఎంత పారితోషికం ఇస్తానన్నా సరే సినిమా చేయదు సాయి పల్లవి. లాస్ట్ ఇయర్ విరాటపర్వం సినిమాలో నటించిన సాయి పల్లవి గార్గి సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ రెండు సినిమాల్లో తన నటనతో ఆమె ఫ్యాన్స్ ని అలరించింది సాయి పల్లవి. ఆ తర్వాత తన నెక్స్ట్ సినిమా విషయంలో గ్యాప్ తీసుకుంది సాయి పల్లవి.

ఇదిలా ఉంటే లేటెస్ట్ గా శేఖర్ కమ్ముల డైరెక్షన్లో ధనుష్ హీరోగా ఒక సినిమా అనౌన్స్ మెంట్ వచ్చింది. ధనుష్ 51వ సినిమాగా ఇది రాబోతుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్నని ఫిక్స్ చేశారు. అసలైతే ఈ సినిమాలో ధనుష్ తో సాయి పల్లవి కలిసి నటించాల్సి ఉందట. ఆల్రెడీ శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ఫిదా, లవ్ స్టోరీ సినిమాలు చేసిన సాయి పల్లవి ధనుష్ సినిమాలో కూడా ఆమెను తీసుకోవాలని అనుకున్నారట. కానీ సాయి పల్లవి మాత్రం ఈ ఆఫర్ ని రిజెక్ట్ చేసినట్టు తెలుస్తుంది.

ధనుష్ తో ఆల్రెడీ మారి 2 సినిమాలో నటించింది సాయి పల్లవి. ఆ సినిమా లో రౌడీ బేబీ సాంగ్ సెన్సేషనల్ హిట్ కూడా అయ్యింది. అయితే ధనుష్ శేఖర్ కమ్ముల సినిమాలో హీరోయిన్ గ్లామర్ గా కనిపించాల్సి ఉందట. అందుకే సాయి పల్లవి అలాంటివి చేయడం ఇష్టం లేకనే ఆ సినిమా అవకాశాన్ని వదులుకుందని తెలుస్తుంది. తన దాకా వచ్చిన ప్రతి ఛాన్స్ చేయాలని అనుకోవట్లేదు సాయి పల్లవి అలా ఎందుకు అంటే కథ నచ్చిన సినిమాలు మాత్రమే ఆమె చేయాలని అనుకుంటుంది. అందుకే సాయి పల్లవి సెలెక్టెడ్ సినిమాలు చేస్తుంది. మరి సాయి పల్లవి నెక్స్ట్ సినిమా ఏది.. ఆ సినిమా అప్డేట్ ఎప్పుడు వస్తుందో అని ఆడియన్స్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు.