Begin typing your search above and press return to search.

DNS లో బాలీవుడ్ హ్యాపెనింగ్ స్టార్‌

తమిళ స్టార్‌ హీరో ధనుష్ తో శేఖర్ కమ్ముల ఒక సినిమాను చేసేందుకు రెడీ అవుతున్నాడు

By:  Tupaki Desk   |   26 Jan 2024 3:30 PM GMT
DNS లో బాలీవుడ్ హ్యాపెనింగ్ స్టార్‌
X

తమిళ స్టార్‌ హీరో ధనుష్ తో శేఖర్ కమ్ముల ఒక సినిమాను చేసేందుకు రెడీ అవుతున్నాడు. వీరి కాంబోలో సినిమాను ప్రకటించి చాలా కాలం అవుతున్న విషయం తెల్సిందే. అసలు వీరిద్దరి కాంబో సినిమా ఉంటుందా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం అయ్యాయి.

ఎట్టకేలకు సినిమా షూటింగ్‌ ప్రారంభం అయ్యింది. ధనుష్ తో పాటు ఈ సినిమాలో టాలీవుడ్‌ కింగ్‌ నాగార్జున కూడా నటిస్తున్న నేపథ్యంలో ఈ సినిమా స్థాయి మరింతగా పెరిగింది అనడంలో సందేహం లేదు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్‌ స్టార్ నటుడిని నటింపజేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.

బాలీవుడ్‌ తో పాటు సౌత్‌ ప్రేక్షకులకు కూడా సుపరిచితుడు అయిన జిమ్‌ సర్భ్‌ ను ఈ సినిమా కోసం శేఖర్ కమ్ముల టీం సంప్రదించడం జరిగిందట. సౌత్ లో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా అవ్వడంతో జిమ్‌ నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడని తెలుస్తోంది.

ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్న హీరోయిన్‌ గా నటిస్తోంది. అమిగోస్ క్రియేషన్స్ తో కలిసి ఈ సినిమాను ఏషియన్ గ్రూప్స్ సంస్థలో నిర్మిస్తున్నారు. శేఖర్ కమ్ముల మొదటి సారి దేవి శ్రీ ప్రసాద్‌ తో కలిసి వర్క్ చేయబోతున్నాడు. ఈ సినిమా పై అటు తమిళ ఇటు తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.