Begin typing your search above and press return to search.

కుబేర ఎఫెక్ట్.. శేఖర్ కమ్ముల డిమాండ్..!

తాను ఇలాంటి సినిమాలు కూడా తీయగలను అని ప్రూవ్ చేసుకున్నాడు శేఖర్ కమ్ముల. ఐతే ఈ సినిమాతో శేఖర్ కమ్ముల డిమాండ్ బాగా పెరిగింది.

By:  Tupaki Desk   |   29 Jun 2025 7:00 AM IST
కుబేర ఎఫెక్ట్.. శేఖర్ కమ్ముల డిమాండ్..!
X

శేఖర్ కమ్ముల డైరెక్షన్లో తెరకెక్కిన కుబేర సినిమా ధనుష్, నాగార్జున లీడ్ రోల్స్ లో నటించారు. సునీల్ నారంగ్ నిర్మించిన ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమాలో రష్మిక మందన్న ఫిమేల్ లీడ్ గా నటించింది. కుబేర సినిమా తెలుగులో సూపర్ హిట్ గా దూసుకెళ్తుంది. ధనుష్ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ అనిపించగా నాగార్జున కూడా డిఫరెంట్ రోల్ లో నటించి మెప్పించాడు. ఇక నేషనల్ క్రష్ రష్మిక మందన్న కూడా ఒక మంచి పాత్రలో నటించింది.

కుబేర సినిమాతో శేఖర్ కమ్ముల డైరెక్షన్ టాలెంట్ ఏంటన్నది మరోసారి ప్రూవ్ అయ్యింది. ఆనంద్ సినిమా నుంచి లవ్ స్టోరీ వరకు శేఖర్ కమ్ముల సున్నితమైన భావోద్వేగాలతో ప్రేమ కథలను చెప్పాడు. మధ్యలో లీడర్ అంటూ ఒక నిజాయితీ గల నాయకుడు ఎలా ఉంటాడో ఎలా ఉండాలో చూపించాడు. ఐతే అలాంటి శేఖర్ కమ్ముల కుబేర అంటూ ఒక డిఫరెంట్ స్టోరీతో వచ్చాడు. ఈ సినిమా చూసిన వాళ్లకు శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన సినిమానేనా అని డౌట్ రాక మానదు.

తాను ఇలాంటి సినిమాలు కూడా తీయగలను అని ప్రూవ్ చేసుకున్నాడు శేఖర్ కమ్ముల. ఐతే ఈ సినిమాతో శేఖర్ కమ్ముల డిమాండ్ బాగా పెరిగింది. తన నెక్స్ట్ సినిమాల లిస్ట్ లో క్రేజీ హీరోలు వచ్చి చేరుతున్నారు. నానితో ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ డిస్కషన్ లో ఉందని తెలుస్తుంది. శేఖర్ కమ్ముల సినిమాల్లో హీరోలు వారెంత స్టార్ అయినా తన పాత్రలుగానే ట్రీట్ చేయబడతారు. అందుకే ఆ సినిమాలు చాలా ఫ్రెష్ గా అనిపిస్తాయి.

నానితో సినిమా ఎప్పుడు ఎలా ఉంటుంది అన్నది తెలియడానికి కాస్త టైం పడుతుంది. ఇక మరోపక్క శేఖర్ కమ్ముల కుబేర సినిమా చూశాక చాలా మంది అతనికి టచ్ లోకి వస్తున్నట్టు తెలుస్తుంది. మంచి కథ ఉంటే చేసేద్దాం అని ఆఫర్స్ ఇస్తున్నారట. ఐతే ఒకరు ఆఫర్ ఇచ్చారు కదా అని ఎలాంటి సినిమా పడితే అలాంటి సినిమా చేసే టైపు కాదు శేఖర్ కమ్ముల. ఆయన చేసే సినిమాల మీద ఆడియన్స్ ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటారో ఆయన కథ కథనాలు కూడా అంతే ఆసక్తికరంగా ఉంటాయి. సో కుబేర తర్వాత శేఖర్ కమ్ముల చేసే సినిమా ఏదైనా సరే సంథింగ్ స్పెషల్ గా ఉంటుందని చెప్పొచ్చు. మరి ఆ లెక్కీ ఛాన్స్ ఎవరు అందుకుంటారన్నది చూడాలి.