'కుబేర' రన్ టైమ్ పై కామెంట్స్.. శేఖర్ కమ్ముల రెస్పాన్స్ ఇలా..
దీంతో తాజాగా మేకర్స్ ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆ విషయంపై శేఖర్ కమ్ముల మాట్లాడారు.
By: Tupaki Desk | 21 Jun 2025 5:43 PM ISTటాలెంటెడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన తాజా మూవీ కుబేర. టాలీవుడ్ కింగ్ నాగార్జున, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న లీడ్ రోల్స్ లో శేఖర్ తెరకెక్కించిన ఆ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆడియన్స్ ను ఓ రేంజ్ లో ఆకట్టుకుంటోంది. అందరినీ మెప్పిస్తోంది.
అయితే కుబేర మూవీ 182 నిమిషాల 38 సెకన్ల రన్ టైమ్ తో థియేటర్స్ లో రిలీజ్ చేశారు మేకర్స్. అంటే మూడు గంటలకుపైగా నిడివితో తీసుకొచ్చారు. తెలుగులో ఒక నిమిషం తక్కువ రన్ టైమ్ తో విడుదల చేశారు. అదే సమయంలో సోషల్ మీడియాలో మూవీ రన్ టైమ్ పై కొన్ని కామెంట్స్ వస్తున్నాయి.. ఇప్పటికే వచ్చాయి కూడా.
దీంతో తాజాగా మేకర్స్ ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆ విషయంపై శేఖర్ కమ్ముల మాట్లాడారు. కచ్చితంగా మూవీకి అంత రన్ టైమ్ అవసరమని తెలిపారు. స్టోరీ లైన్ అనుకున్నప్పటి నుంచి కూడా వాస్తవికతకు దగ్గరగా సినిమా తీయాలని అనుకున్నట్లు చెప్పారు. అదే సమయంలో షూటింగ్ కు అనుకున్నదానికంటే బడ్జెట్ మించి పోయిందన్నారు.
అప్పుడు స్టోరీలో కొన్ని కోతల విధించాలనుకునేవాడిని, కానీ ఆ సమయంలో మూవీ టీమ్ సపోర్ట్ గా నిలిచిందని పేర్కొన్నారు. సినిమా ఎలా తీయాలని అనుకున్నారో, అలాగే తీయమని ధైర్యం చెప్పారు. తన కెరీర్ లో కుబేర అద్భుతమైన చిత్రంగా వర్ణించారు. నిడివి విషయంలో కొంత మంది కొన్ని కామెంట్స్ చేస్తున్నారని చెప్పారు.
కానీ సినిమా కథకు కోతలు విధించడం మూవీ టీమ్ కు తెలిసిన విషయమని, అదే సమయంలో స్టోరీ ఎలా చెప్పాలనుకున్నామో అలాగే చెప్పాలని అభిప్రాయపడ్డారు. అదే ధర్మమని అన్నారు. సినిమాకు ఆ రన్ టైమ్ అవసరమని పేర్కొన్నారు. కుబేర మూవీ విషయంలో తాను గర్వంగా ఉన్నానని, సంతోషంగా కూడా ఉన్నానని చెప్పారు.
సినిమా చూస్తున్నప్పుడు ఆడియన్స్ ఎవరూ కూడా సాగదీతగా ఉందని అనుకోరనుకుంటున్నట్లు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ప్రపంచంలో పేద, ధనిక అనే వ్యత్యాసం ఉందని అన్నారు. అది అలా పెరుగుతుందని చెప్పారు. అందుకే తాను ఆ జోనర్ లో సినిమా తీశానని చెప్పారు. తనకు వచ్చిన ఆలోచన నుంచి కుబేర కథ పుట్టిందని పేర్కొన్నారు. ప్రస్తుతం శేఖర్ కమ్ముల కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
