Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : అందాలకు ఈమె వేదిక

ఈ అమ్మడు తెలుగు లో చేసింది తక్కువ సినిమాలే అయినా కూడా తన అందమైన రూపంతో చాలా మంది దృష్టిని ఆకర్షించింది.

By:  Tupaki Desk   |   9 Jan 2024 4:30 PM GMT
పిక్ టాక్ : అందాలకు ఈమె వేదిక
X

కళ్యాణ్ రామ్‌ విజయదశమి సినిమా ద్వారా 2007 సంవత్సరంలో టాలీవుడ్ కి పరిచయం అయిన ముద్దుగుమ్మ వేదిక. ఈ అమ్మడు తెలుగు లో చేసింది తక్కువ సినిమాలే అయినా కూడా తన అందమైన రూపంతో చాలా మంది దృష్టిని ఆకర్షించింది. ఇప్పటికి కూడా ఈ అమ్మడికి తెలుగు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది.


సోషల్‌ మీడియా ద్వారా ఈ అమ్మడు రెగ్యులర్ గా తన అందమైన ఫోటోలను షేర్ చేయడం ద్వారా స్టార్‌ హీరోయిన్స్ రేంజ్ లో ట్రెండ్‌ అవుతూనే ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు షేర్‌ చేసిన ఫోటోలు మరోసారి ఈమెను వార్తల్లో నిలిపింది.

అందమైన వేదిక కవ్వించే అందంతో మరోసారి వావ్‌ అనిపించేంత అందంగా ఉందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇండస్ట్రీలో అడుగు పెట్టి దాదాపు ఇరవై ఏళ్లు అవుతూ ఉన్నా కూడా అంతే అందంతో ఈ అమ్మడు కవ్విస్తోందని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

అందమైన ఈ అమ్మడి యొక్క ఫోటోలు మరో సారి వైరల్‌ అవుతున్న నేపథ్యంలో తెలుగు లో ఈ అమ్మడికి ఎందుకు ఆఫర్లు ఎక్కువ రావడం లేదు అన్నట్లుగా కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో ఈ రేంజ్‌ లో అందాల ఆరబోత చేస్తున్న వేదిక బాలయ్య తో పాటు పలువురు టాలీవుడ్ హీరోలకు జోడీగా నటించింది. అయితే అదృష్టం కలిసి రాకపోవడంతో సక్సెస్‌ దక్కలేదు.