Begin typing your search above and press return to search.

క్ల‌బ్‌లో ఫ్లూటుగా తాగి ఊగిన హాట్ బ్యూటీ!

ముంబై క్లబ్‌లో హాంజీ ప్రమోషన్ మధ్య బోల్డ్ బ్లాక్ డ్రెస్‌లో షెహ్నాజ్ గిల్ చాలా అసౌకర్యంగా కనిపించిన వీడియో వైర‌ల్ గా మారింది.

By:  Tupaki Desk   |   14 Sep 2023 3:30 AM GMT
క్ల‌బ్‌లో ఫ్లూటుగా తాగి ఊగిన హాట్ బ్యూటీ!
X

బాలీవుడ్ లో నైట్ పార్టీలు చాలా కామ‌న్. ప‌బ్ లేదా క్ల‌బ్ లో అంద‌మైన క‌థానాయిక‌ల ఫుల్ చిలౌట్ మూవ్ మెంట్స్ కెమెరా కంటప‌డ‌టం అవి వైర‌ల్ కావ‌డం తెలిసిన వ్య‌వ‌హార‌మే. ఇప్పుడు అలాంటి ఒక వీడియో అంత‌ర్జాలాన్ని షేక్ చేస్తోంది. స‌ద‌రు న‌టీమ‌ణి పార్టీ త‌ర్వాత బ‌య‌టికి వెళుతూ సాఫీగా న‌డిచేందుకు త‌న సోద‌రుడు లేదా ఎవ‌రో ఒక‌రి స‌హాయం తీసుకోవాల్సి వ‌చ్చింది. తాగి క్ల‌బ్ నుంచి బ‌య‌ట‌ప‌డుతూ ఊగుతున్నప్పుడు ఆమె చేతిని ప‌ట్టుకుని నడిపిస్తున్నారు క‌జిన్స్. ప్ర‌స్తుతం ఈ వీడియో అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది.

ముంబై క్లబ్‌లో హాంజీ ప్రమోషన్ మధ్య బోల్డ్ బ్లాక్ డ్రెస్‌లో షెహ్నాజ్ గిల్ చాలా అసౌకర్యంగా కనిపించిన వీడియో వైర‌ల్ గా మారింది. నెటిజన్లు షెహ్నాజ్ గిల్ కొత్త పాట 'హాంజీ లాంచ్..' వీడియో ఆన్‌లైన్‌లో అంత మంచి స్పందనలు పొందలేదు. ఈవెంట్ కోసం ఈ భామ హాటెస్ట్ అవ‌తార్ లో హాజ‌రైంది. బ్లాక్ క‌ల‌ర్ పొట్టి ఫ్రాకులో ఈ వేదిక వ‌ద్ద ప్ర‌త్య‌క్ష‌మైంది. ఈ దుస్తుల్లో అసౌకర్యంగా కనిపించ‌లేద‌ని లైవ్ గా వీక్షించిన‌ నెటిజన్లు భావిస్తున్నారు. గిల్ న‌టించిన త‌దుప‌రి చిత్రం 'థాంక్యూ ఫర్ కమింగ్' విడుదలకు సిద్ధమవుతున్న సంగ‌తి తెలిసిందే. సహనటులు భూమి పెడ్నేకర్, డాలీ సింగ్, కుషా కపిల, షిబానీ భేడీలతో కలిసి ముంబైలోని ఒక క్లబ్‌లో గిల్ కనిపించింది. వారి కొత్త పాట హాంజీ లాంచ్ కార్య‌క్ర‌మం సంద‌డిగా సాగింది. కానీ ఈ దుస్తుల్లో గిల్ అసౌకర్యంగా కనిపించారని నెటిజన్లు భావిస్తున్నారు.

షెహ్నాజ్ గిల్ వైరల్ వీడియో అంత‌ర్జాలంలో విడుద‌లైంది. పార్టీ అనంత‌రం షెహ్నాజ్ గిల్ సోదరుడు షాబాజ్ షెహ‌నాజ్ గిల్ చేతిని పట్టుకుని క్లబ్ నుండి బయటకు వస్తున్నప్పుడు కెమెరా ఫ్లాష్ లు మెరిసాయి. ఈ ప‌రిస్థితి చూసాక గిల్ తాగింది! అని నెటిజన్లు నిశ్చయించుకున్నారు. షెహ్నాజ్ గిల్ క్లబ్ నుండి నిష్క్రమించిన వీడియో వైరల్ అవుతుంది. సోదరుడు షాబాజ్ గిల్ ఊగ‌కుండా స‌రిగా న‌డిచేందుకు సహాయం చేస్తూ క‌నిపించాడు. కొంచెం ఎక్కువగా తాగ‌డం వ‌ల్ల‌నే ఈ ప‌రిస్థితి వ‌చ్చిందని ఈ వీడియో చూశాక నెటిజ‌నుల భావిస్తున్నారు.

తాజా ఈవెంట్లో గిల్ తన లేడీ గ్యాంగ్‌తో వేడుక‌లో కలకలం రేపింది. ఆమె షాంపైన్ సేవిస్తూ కాలు ఆడించడం కనిపించింది. అయితే ప‌దే ప‌దే త‌న పొట్టి దుస్తుల‌ను స‌రి చేసుకునేందుకు చాలా తంటాలు ప‌డింది. దీనిపై నెటిజ‌నులు ర‌క‌ర‌కాలుగా కామెంట్లు చేస్తున్నారు. షెహ్నాజ్ చాలా అసౌకర్యంగా .. చాలా అసహ్యంగా కనిపిస్తోంది. ఇవేవీ ఆమెకు సహజంగా రాలేదు. దాచేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. షెహ్ నాజ్ ని ఇలా చూడటం చాలా అసహ్యకరం అంటూ వ్యాఖ్యానించాడు.

మ‌రొక నెటిజ‌న్ ఇలా స్పందించారు. ''షెహ్నాజ్ చాలా కష్టపడుతోంది...ఆమె తన బట్టలతో సౌకర్యంగా లేదు.. ఇతరులు చేసే పనిని కాపీ కొట్టడానికి ప్రయత్నిస్తుంది. నేను వారి అన్ని ప్రచారాలలో దీనిని గమనించాను. ఆమె అందంగా ఉంది కానీ నటించగలదని నేను అనుకోను'' అని వ్యాఖ్యానించారు. షెహనాజ్ గిల్.. మీరు ఫేమస్ అయినప్పటి నుంచి మీ డ్రెస్సింగ్ చాలా వల్గర్‌గా మారింది.. ఇంతకు ముందు ఇలా ఉండేవారు కాదు.. అంటూ ఓ నెటిజన్ వ్యాఖ్యానించాడు. 'షెహనాజ్ తప్పు ఏమిటి?' అని కోపంగా ఓ అభిమాని ప్రశ్నించారు. హిందీ బిగ్ బాస్ తో షెహ‌నాజ్ పేరు మార్మోగింది. ప్ర‌స్తుతం ఈ భామ న‌ట‌నారంగంలో త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకుంటోంది.