'కాంటాలాగా గర్ల్' చివరి మెసేజ్ ఎవరికి?
ఫలానా మాజీ ప్రియుడికి చివరి మెసేజ్! అంటూ ఇప్పుడు `కాంటాలాగా గర్ల్` షెఫాలి జరివాలా చివరి మెసేజ్ గురించి ప్రముఖ హిందీ మీడియాలో వెలువడిన కథనం అందరి దృష్టిని ఆకర్షించింది.
By: Tupaki Desk | 28 Jun 2025 8:52 AMసెలబ్రిటీలు మరణిస్తే సహజంగానే స్పెక్యులేషన్స్ ఎక్కువగా ఉంటాయి. ఫలానా మాజీ ప్రియుడికి చివరి మెసేజ్! అంటూ ఇప్పుడు `కాంటాలాగా గర్ల్` షెఫాలి జరివాలా చివరి మెసేజ్ గురించి ప్రముఖ హిందీ మీడియాలో వెలువడిన కథనం అందరి దృష్టిని ఆకర్షించింది. అసలు షెఫాలీ పరాగ్ త్యాగీని పెళ్లాడక ముందు ఎవరిని ప్రేమించింది? మాజీతో డేటింగ్ ప్రస్తుత భర్త త్యాగీని కలవరపాటుకు గురి చేసిందా? అంటూ కథనాలు వెలువడడం ఆశ్చర్యపరుస్తోంది.
అయితే ఈ కథనం ప్రకారం.. షెఫాలి జరివాలా, తన మాజీ ప్రియుడు సిద్ధార్థ్ శుక్లా మధ్య 15 ఏళ్ల క్రితం బ్రేకప్ తర్వాత కేవలం మంచి స్నేహం మాత్రమే కొనసాగింది. బుల్లితెర కోసం కలిసి పని చేసారు. అదే క్రమంలో డేటింగ్ చేసారు. కానీ విడిపోయారు. విడిపోయినా కలిసి మెలిసి స్నేహంగా ఉన్నారు. గౌరవప్రదమైన బంధాన్ని కొనసాగించారు! దీనిని షెఫాలి పాత ఇంటర్వ్యూ ఒకటి ధృవీకరించింది.
చాలా కాలం తరవాత బిగ్ బాస్ లో షెఫాలి తన మాజీ ప్రియుడు శుక్లాను కలిసారు. అయితే ఇది ఆమె భర్త త్యాగిలో అభద్రతా భావానికి కారణమైందా? అన్నది చర్చగా మారింది. కాంటా లగా గర్ల్ 2019 లో బిగ్ బాస్ 13 లోకి ప్రవేశించినప్పుడు చర్చల్లోకొచ్చింది. మంచి ప్లేయర్ అన్న గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈ వేదికపై మాజీ ప్రియుడు, దివంగత నటుడు సిద్ధార్థ్ శుక్లాతో తన పరిణతి చెందిన బంధాన్ని కూడా ప్రజలు గమనించారు. సిద్ధార్థ్‌తో బిగ్ బాస్ ఇంట్లో ఉండటంపై షెఫాలి బహిరంగంగా మాట్లాడారు. తన గతం ఏదైనా కానీ, ప్రస్తుతం ఒకరికొకరం పరిణతితో వ్యవహరిస్తామని షెఫాలీ చెప్పారు. కొన్నిసార్లు మా మధ్య మాటల్లో చాలా లోతైన విషయాలు ఉండేవని, సైన్స్, విశ్వం, బుల్లెట్ రైళ్లు వంటి అంశాలపై వారు చర్చించుకునేవాళ్లమని కూడా షెఫాలీ చెప్పింది. అయితే వారి మధ్య నిజాయితీతో కూడుకున్న సంభాషణలు అభిమానులను ఆకర్షించాయి.
భర్త పరాగ్ కలత?
తన మాజీతో టీవీలో చూడటం భర్త త్యాగీలో అభద్రతా భావాన్ని కలిగించిందా? అని ప్రశ్నించగా, హబ్బీ పరాగ్ త్యాగీ తనపై పూర్తి నమ్మకం ఉంచాడని చెప్పింది. "సిద్ధార్థ్‌తో నా బంధం ఇంట్లో ఏ సమయంలోనూ అసౌకర్యాన్ని కలిగించలేదు'' అని షెఫాలీ తెలిపింది. షోలోకి వెళ్లే ముందే సిద్ధార్థ్‌తో తన గతం గురించి పరాగ్‌కు తెలుసు.. అతడు తనకు మద్దతునిచ్చాడని షెఫాలీ వెల్లడించారు.
షెఫాలి- సిద్ధార్థ్ 2014లో పరాగ్‌ను వివాహం చేసుకోవడానికి చాలా కాలం ముందు (15ఏళ్ల క్రితం) డేటింగ్ చేశారు. విడిపోయాక కూడా కలిసినప్పుడు గౌరవప్రదంగా ఉన్నారు. చాలా ఈవెంట్లు షూట్ లలో కలిసి పని చేసామని తెలిపారు షెఫాలి. అతడు అకస్మాత్తుగా 2021లో మరణించినప్పుడు షెఫాలి సోషల్ మీడియాలో అతడికి భావోద్వేగ నివాళిని పోస్ట్ చేశారు. బిగ్ బాస్ నుండి వారి హృదయపూర్వక కౌగిలింతల పాత ఫోటో పోస్ట్ చేసారు. దాని శీర్షిక ``ఈ రోజు నీ గురించి ఆలోచిస్తున్నాను కేవలం దోస్త్ @ సిద్ధార్థ్ శుక్లా`` అని రాసారు. షెఫాలి ఆకస్మిక మరణానికి ముందు ఆమె చివరి పోస్ట్ సిద్ధార్థ్ కు నివాళి. షెఫాలి 42 వయసులో గుండెపోటుతో మరణించారని వార్తలు వచ్చాయి. తన చివరి పోస్ట్ మాజీ ప్రియుడి గురించే అని తెలిసి అభిమానులు భావోద్వేగానికి గురవుతున్నారు. యాథృచ్ఛికంగా తన మాజీ ప్రియుడు అకస్మాత్తుగా 40 వయసుకే గుండెపోటుతో మరణించగా, ఇప్పుడు షెఫాలీ 42 వయసుకే గుండెపోటుతో మరణించిందని కథనాలు రావడం ఆశ్చర్యపరుస్తోంది. అయితే షెఫాలీ ఎలా మరణించారు? అన్నది వైద్యులు, పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ ధృవీకరించాల్సి ఉంది ఇంకా.