కాంటాలాగా గర్ల్ మృతిని ముందే ఊహించాడు!
'కాంటాలాగా గర్ల్' షెఫాలి జరివాలా ఆకస్మిక మరణం చాలా థియరీలను తెరపైకి తెచ్చింది.
By: Tupaki Desk | 30 Jun 2025 12:08 AM IST`కాంటాలాగా గర్ల్` షెఫాలి జరివాలా ఆకస్మిక మరణం చాలా థియరీలను తెరపైకి తెచ్చింది. మొదట ఆమె భర్త అనుమానాస్పదంగా ప్రవర్తించాడంటూ కొన్ని మీడియాలు ప్రచారం చేసాయి. కానీ ఇప్పటికీ పోస్ట్ మార్టమ్ నివేదిక వెలువడలేదు. వేలి ముద్రల నిపుణుల పరిశోధనల రిపోర్ట్ కూడా వెలువడలేదు.
అయినా ఇప్పటికే షెఫాలి మరణంపై అనుమానాలు అలానే ఉన్నాయి. ఆమె గుండెపోటుతో చనిపోయిందని ప్రాథమిక సమాచారం అందింది. కానీ అది నిజమా కాదా? పోలీసులే నిగ్గు తేల్చాల్సి ఉంది. ఇక షెఫాలి అంత్యక్రియల అనంతరం, శ్మశాన వాటిక నుంచి బూడిద తీసుకుని వస్తున్న ఆమె భర్త త్యాగి కన్నీరు పెడుతున్న వీడియోలు అంతర్జాలంలో వైరల్ అయ్యాయి.
చాలా ఆరోగ్య నియమాలు పాటిస్తూ పిట్ గా ఉన్న షెఫాలి అకస్మాత్తుగా గుండెపోటుకు గురవ్వడాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక ఆరేళ్లుగా యాంటి ఏజింగ్ ఇంజెక్షన్లు తీసుకుంటున్న షెఫాలి ఉపవాస సమయంలో ఇంజెక్షన్ తీసుకోవడంతోనే గుండెపోటు వచ్చిందని ఒక కొత్త థియరీ వైరల్ అవుతోంది. యాంటి ఏజింగ్ ఇంజక్షన్లు తీసుకుంటోందని ఆమె వైద్యుడు కూడా ధృవీకరించారు.
వీటన్నిటి మధ్య పరాస్ ఛబ్రా పాడ్‌కాస్ట్ క్లిప్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. తాజా వైరల్ క్లిప్ లో షెఫాలీతో కుండలి పఠన సెషన్‌లో పరాస్ `ఆకస్మిక మరణం` గురించి వింతగా ఊహించాడు. పరాస్ చేసిన ఈ స్పెషల్ కామెంట్ ఆశ్చర్యపరిచింది. అతడు షెఫాలి ఎనిమిదో ఇంటి గురించి మాట్లాడాడు. ఇది సాధారణంగా నష్టం, ఆకస్మిక సంఘటనలతో ముడిపడి ఉంటుంది. చంద్ర, కేతు, బుద్ధులతో కూడిన ఇబ్బందికరమైన అమరికల గురించి పరాస్ చాలా మాట్లాడాడు. ఇవి తరచుగా నాడీ సంబంధిత సమస్యలు, ఊహించని సంఘటనలను సూచిస్తాయి. ఓవరాల్ గా అతడు ముందే చావును ఊహించినట్టు జోశ్యం చెప్పాడు.
ఇదే పాడ్ కాస్ట్ లో షెఫాలీ కొన్నేళ్లుగా మూర్చవ్యాధి నుంచి బయటపడేందుకు క్రమశిక్షణతో ఉంటున్నానని తెలిపింది. చికిత్స, క్రమశిక్షణ కారణంగా ఇరవై ఏళ్లుగా మూర్చతో సమస్య లేకుండా ఉన్నానని వెల్లడించింది. మాజీ ప్రియుడు, బిగ్ బాస్ ఫేం శుక్లా 40వయసులో అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించిన విషయాన్ని కూడా షెపాలి పాడ్ కాస్ట్ లో ప్రస్థావించింది.
