కాంటాలాగ గర్ల్.. మొదటి భర్తతో విడాకుల వెనక..
విడాకుల తర్వాత షెఫాలి జరివాలా టెలివిజన్ నటుడు పరాగ్ త్యాగిని ఒక కామన్ స్నేహితుడు నిర్వహించిన విందులో కలిశారు.
By: Tupaki Desk | 28 Jun 2025 11:17 PM ISTకాంటాలాగ గర్ల్ షెఫాలి జరివాలా ఆకస్మిక మరణం కుటుంబం, ఆమె అభిమానులు, స్నేహితులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రస్తుతం ముంబై కూపర్ ఆస్పత్రిలో పోస్ట్ మార్టమ్ సాగుతోందని కథనాలొచ్చాయి. షెఫాలి రెండో భర్త పరాగ్ త్యాగి ముంబైలోని కూపర్ ఆసుపత్రికి చేరుకున్న ఫోటోలు వీడియోలు వైరల్ అయ్యాయి.
ఇక అప్పటికే విడాకులు తీసుకున్న షెఫాలి జరివాలాతో పరాగ్ త్యాగి పరిచయం స్నేహం, పెళ్లి వగైరా చాలా విషయాలపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అంతేకాదు అసలు షెఫాలి మొదటి భర్తకు ఎందుకు విడాకులిచ్చింది? అన్న ఆరాలు మొదలయ్యాయి. ఈ ఆరాల్లో తెలిసిన నిజాలు ఆశ్చర్యపరుస్తున్నాయి.
షెఫాలి జరివాలా మొదటి భర్త ప్రముఖ గాయకుడు హర్మీత్ సింగ్. వారు 2004లో వివాహం చేసుకున్నారు. అయితే కేవలం నాలుగైదేళ్లకే మనస్ఫర్థల కారణంగా 2009లో విడిపోయారు. అప్పట్లోనే మొదటి భర్త హర్మీత్ పై షెఫాలి గృహహింస కేసును నమోదు చేసింది. అతడు తనను మానసికంగా శారీరకంగా హింసించాడని ఆరోపించింది. షెఫాలి జరివాలా ముంబైలోని ఓషివారా పోలీస్ స్టేషన్‌లో హర్మీత్ సింగ్‌పై వేధింపులకు పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసింది. తన అనుమతి లేకుండా అతడు ఉమ్మడి ఖాతా నుండి సుమారు రూ.12 లక్షలు విత్‌డ్రా చేశాడని కూడా ఆరోపించింది.
నన్ను అర్థం చేసుకోలేదు.. మానసికంగా శారీరకంగా హింసించాడనేది ఆమె ఆరోపణ. జీవితంలో సంతోషం లేనప్పుడు విడిపోవడమే మేలు. మన సమాజంలో దీనిని వేరుగా చూస్తారు. కానీ నేను ఎవరినీ పట్టించుకోను.. సమాజాన్ని కేర్ చేయను. నాకు సరైనది అని భావించేది చేయడం తెలుసు. నా కుటుంబం నుంచి బలమైన మద్ధతు ఉంది అని షెఫాలి పేర్కొంది.
షెఫాలి తన వైరల్ మ్యూజిక్ వీడియో కాంటా లగా ప్రజాదరణ పొందిన తర్వాత హర్మీత్‌ను కలిసింది. తరువాత ఆమె ప్యార్ హుమేన్ కిస్ మోడ్ పె లే ఆయా సహా మరిన్ని మ్యూజిక్ వీడియోలలో `మీట్ బ్రదర్స్`తో కలిసి పనిచేసింది. మీట్ బ్రదర్స్ అనేది హర్మీత్- మన్మీత్ బ్రదర్స్ కి చెందిన మ్యూజిక్ బ్యాండ్. హర్మీత్ తన కెరీర్‌ను కహానీ ఘర్ ఘర్ కి, కుసుమ్, క్యుంకి సాస్ భీ కభీ బహు థి వంటి టీవీ షోలలో నటుడిగా ప్రారంభించాడు. తరువాత అతడు తన సోదరుడు మన్మీత్‌తో కలిసి సంగీత రంగంలో గుర్తింపు పొందాడు. బ్రదర్స్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు సహా అనేక అవార్డులను కూడా గెలుచుకున్నారు. హర్మీత్ ప్రస్తుతం సునైనా సింగ్‌ను వివాహం చేసుకున్నాడు. వారికి ఒక కుమారుడు ఉన్నాడు.
విడాకుల తర్వాత షెఫాలి జరివాలా టెలివిజన్ నటుడు పరాగ్ త్యాగిని ఒక కామన్ స్నేహితుడు నిర్వహించిన విందులో కలిశారు. ఆ తర్వాత ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. పెళ్లి చేసుకున్నారు. 2012లో నాచ్ బలియే సెట్స్‌లో పరాగ్ ఆమెకు ప్రపోజ్ చేయడానికి ముందు ఈ జంట కొన్ని సంవత్సరాలు డేటింగ్ చేశారు. 2014లో వారు వివాహం చేసుకున్నారు. ఒకసారి షెఫాలి పరాగ్‌తో ఒక బిడ్డను దత్తత తీసుకోవాలనే కోరికను వ్యక్తం చేసినట్టు తెలిపారు.
