Begin typing your search above and press return to search.

కాంటాలాగా గ‌ర్ల్ రెండు బాక్సుల మందులు మింగింది?

ఎలాంటి అనారోగ్యాలు, దుష్ప‌రిణామాలు లేకుండానే కాంటాలాగా గ‌ర్ల్ షెఫాలి జరివాలా 42 సంవత్సరాల వయసులో గుండెపోటు కారణంగా మరణించారు

By:  Tupaki Desk   |   30 Jun 2025 7:20 PM IST
కాంటాలాగా గ‌ర్ల్ రెండు బాక్సుల మందులు మింగింది?
X

ఎలాంటి అనారోగ్యాలు, దుష్ప‌రిణామాలు లేకుండానే కాంటాలాగా గ‌ర్ల్ షెఫాలి జరివాలా 42 సంవత్సరాల వయసులో గుండెపోటు కారణంగా మరణించారు. అప్ప‌టివ‌ర‌కూ పూర్తి ఆరోగ్యంగా కనిపించిన చాలా మంది ప్రముఖులు గుండెపోటుతో మరణించిన‌ట్టే షెఫాలిని గుండె నొప్పి అక‌స్మాత్తుగా ప్రాణాంత‌క‌మైంది. షెఫాలి మాజీ ప్రియుడు, నటుడు సిద్ధార్థ్ శుక్లా 40 సంవత్సరాల వయసులో (సెప్టెంబర్ 2021లో) గుండెపోటు కారణంగా మరణించారు. ఇప్పుడు షెఫాలి కూడా త‌న స్నేహితుడి తీరుగానే మృతి చెందడం క‌లచివేసింది.

త‌న‌కు ఎలాంటి గుండె జ‌బ్బు లేద‌ని, అయితే కొన్నేళ్లుగా యాంటీ ఏజింగ్ ఇంజెక్ష‌న్లు, ట్యాబ్లెట్ల‌ను మింగుతోంద‌ని త‌న వ్య‌క్తిగ‌త వైద్యుడు ధృవీక‌రించారు. వాటి వ‌ల్ల కూడా షెఫాలీకి ఎలాంటి స‌మ‌స్యా త‌లెత్త‌లేద‌ని అన్నారు. షెఫాలి మ‌ర‌ణంలో భ‌ర్త వైపు నుంచి ఎలాంటి నేరానికి ఆస్కారం లేద‌ని ఇప్ప‌టికే పోలీసులు పేర్కొన్న‌ట్టు క‌థ‌నాలొచ్చాయి. పోస్ట్ మార్ట‌మ్ రిపోర్ట్, ఫోరెన్సిక్ రిపోర్టుల ప్ర‌కారం.. షెఫాలి ఇంట్లో ఉన్న మెడిక‌ల్ రికార్డులు మొత్తాన్ని పోలీసులు ప‌రిశీలిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా త‌న ఇంట్లో రెండు బాక్సుల‌ యాంటి ఏజింగ్ ట్యాబ్లెట్లు, ఇంజెక్ష‌న్ల‌ను క‌నుగొన్నామ‌ని తెలిపారు. స్కిన్ గ్లో, వ‌య‌సును పెర‌గ‌నివ్వ‌కుండా ఆపే య‌వ్వ‌న సిరిని పెంచే ట్యాబ్లెట్లు, ఇంజెక్ష‌న్లు ఇందులో ఉన్నాయ‌ని చెబుతున్నారు.

ఉప‌వాస స‌మ‌యంలో మాత్రలు, యాంటీ ఏజింగ్ ఇంజెక్షన్ తీసుకుంద‌ని, ఆ తర్వాత ఆమె రక్తపోటు బాగా పడిపోయిందని పోలీసులు అంచ‌నా వెలువ‌రించారు. నిజానికి ఈ మందులే త‌న‌కు ప్రాణాంత‌కంగా మారాయ‌ని ఊహిస్తున్నారు.

గ్లూటాథియోన్ ప్ర‌యోజ‌నాల విష‌యానికి వ‌స్తే, కణజాల నిర్మాణం, రిపేర్ల కోసం శరీరానికి అవసరమైన రసాయనాలు, ప్రోటీన్లను తయారు చేయడంలో, రోగనిరోధక వ్యవస్థ పనితీరును మెరుగుప‌ర‌చ‌డంలో పాల్గొంటుంది. వృద్ధాప్యం, ఆల్కహాల్ వాడకం రుగ్మత, కాలేయ వ్యాధి, గుండె జబ్బులు వంటి వాటి నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు ప్రజలు గ్లూటాథియోన్ తీసుకుంటారు. అయితే కొన్నిసార్లు దీనివ‌ల్ల అలెర్జీలు వ‌స్తుంటాయ‌ని వైద్యులు చెబుతున్నారు. కొన్ని యాంటీ ఏజింగ్ ఉత్పత్తులు చర్మ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయని వైద్యులు ధృవీక‌రించారు. వాటి వాడకం వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ లేకుండా జ‌ర‌గ‌కూడ‌దు.