Begin typing your search above and press return to search.

ఆరెంజ్ బ్యూటీ ఇంత‌కాలానికి శుభ‌వార్త‌

`రూబ రూబ...` అంటూ అమ్మాయి వెంట‌ప‌డి మ‌రీ విసిగించాడు ల‌వ‌ర్ బోయ్ రామ్ చ‌ర‌ణ్‌. `ఆరెంజ్` త‌న కెరీర్ బెస్ట్ సినిమా అని చెబుతుంటాడు వీలున్న‌ప్పుడ‌ల్లా.

By:  Tupaki Desk   |   15 May 2025 11:15 AM IST
ఆరెంజ్ బ్యూటీ ఇంత‌కాలానికి శుభ‌వార్త‌
X

`రూబ రూబ...` అంటూ అమ్మాయి వెంట‌ప‌డి మ‌రీ విసిగించాడు ల‌వ‌ర్ బోయ్ రామ్ చ‌ర‌ణ్‌. `ఆరెంజ్` త‌న కెరీర్ బెస్ట్ సినిమా అని చెబుతుంటాడు వీలున్న‌ప్పుడ‌ల్లా. ఒక అబ్బాయి ఒక అంద‌మైన అమ్మాయిని ప్రేమిస్తాడు.. కానీ మ‌రో అంద‌మైన అమ్మాయి జీవితంలో తార‌స‌ప‌డితే? ఈ ఆలోచ‌నే గ‌మ్మ‌త్త‌యిన‌ది. అలాంటి ఒక క‌థ‌లో రామ్ చ‌ర‌ణ్ న‌టించాడు. బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ముఖ్యంగా ఈ సినిమాలో జెనీలియాతో ఒక వైపు, షాజ‌న్ తో మ‌రో వైపు ల‌వ్ ట్రాక్ అద్భుతంగా పండాయి. కానీ దుర‌దృష్ట‌వ‌శాత్తూ ఈ మూవీలో ఆస్ట్రేలియా, గ్రాఫిటీ వ‌గైరా అప్ప‌టి ఆడియెన్ కి అంత‌గా క‌నెక్ట‌వ్వ‌లేదు. క‌థ పాయింట్ గొప్ప‌దే అయినా, స‌న్నివేశాలు బావున్నా, పాశ్చాత్య భావ‌న‌ల్ని అప్ప‌టి యూత్ అర్థం చేసుకోలేదు.

అవ‌న్నీ అటుంచితే ఈ చిత్రంలో రూబ మాత్రం తెలుగు కుర్రాళ్ల హృద‌యాల‌ను గెలుచుకుంది. ఆరెంజ్‌లో రామ్ చరణ్ సరసన రూబా పాత్రతో మెరిపించిన షాజ‌న్ ప‌ద‌మ్ సీ ఆ త‌ర్వాత‌ హౌస్‌ఫుల్ 2లోను న‌టించింది. అయితే ఇటీవ‌లి కాలంలో రంగుల ప్ర‌పంచంలో షాజ‌న్ ప‌ద‌మ్ సీ ఉనికి అంత‌గా క‌నిపించ‌లేదు. షాజ‌న్ కి గ‌త ఏడాది న‌వంబ‌ర్ లో నిశ్చితార్థం అయింది. ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త ఆశిష్ క‌నకియాను ఈ బ్యూటీ జూన్ 5న పెళ్లాడుతోంది. జూన్ 7న సంగీత్ వేడుక , ఆ తర్వాత పార్టీ జరగనున్నాయి.

థియేట‌ర్ రంగంలో నిష్ణాతులైన‌ షారన్ ప్రభాకర్ , దివంగత అలిక్ పదమ్సీ కుమార్తె షాజాన్. ప్ర‌స్తుతం కాబోయే జంట ఫోటోలు ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ అవుతున్నాయి. అత‌డు ఒక కామ‌న్ ఫ్రెండ్ ద్వారా ప‌రిచ‌యం అయ్యాడు. కాల‌క్ర‌మంలో ఇద్ద‌రి మ‌ధ్యా అనుబంధం పెరిగింది.. త‌ర్వాత డేటింగ్ మొద‌లైంది. అత‌డితో ఉంటే చాలా స‌ర‌దాగా ఉల్లాసంగా ఉంటుంది. ఎప్పుడూ న‌వ్వుతూ ఉంటాము అని చెప్పింది షాజ‌న్. మొత్తానికి ఆరెంజ్ బ్యూటీ ఓ ఇంటిది అవుతోంది.