Begin typing your search above and press return to search.

టాప్ స్టార్లు చేయ‌లేనిది విజ‌య్ చేస్తున్నాడు

ఇండ‌స్ట్రీలో ఒక‌రు చేయాల్సిన సినిమాలు మ‌రొక‌రికి వెళ్ల‌డం చాలా కామ‌నైపోయింది.

By:  Tupaki Desk   |   14 May 2025 4:46 AM
టాప్ స్టార్లు చేయ‌లేనిది విజ‌య్ చేస్తున్నాడు
X

ఇండ‌స్ట్రీలో ఒక‌రు చేయాల్సిన సినిమాలు మ‌రొక‌రికి వెళ్ల‌డం చాలా కామ‌నైపోయింది. ఈ మ‌ధ్య అది మ‌రీ ఎక్కువైపోయింది. 2023లో హాయ్ నాన్న సినిమాతో డైరెక్ట‌ర్ గా టాలీవుడ్ కు ప‌రిచ‌య‌మైన శౌర్యువ్ మొద‌టి సినిమాతోనే మంచి హిట్ ను త‌న అకౌంట్ లో వేసుకున్నాడు. హాయ్ నాన్న లాంటి క‌త్తిమీద సాము క‌థ‌ను అత‌ను డెలివ‌ర్ చేసిన విధానం అంద‌రినీ మెప్పించింది.

దీంతో హాయ్ నాన్న త‌ర్వాత శౌర్యువ్ ఎవ‌రితో సినిమా చేస్తాడ‌నే ఆస‌క్తి అంద‌రిలోనూ పెరిగిపోయింది. కానీ ఆ సినిమా రిలీజై ఏడాది దాటినా ఇప్ప‌టికీ శౌర్యువ్ త‌న నెక్ట్స్ మూవీని అనౌన్స్ చేసింది లేదు. మ‌ధ్య‌లో ఎన్టీఆర్ తో సినిమా చేస్తాడ‌ని అన్నారు కానీ అది ప‌ట్టాలెక్క‌లేదు. ఎన్టీఆర్ కోసం శౌర్యువ్ ఓ ప‌వ‌ర్‌ఫుల్ యాక్ష‌న్ డ్రామాను రెడీ చేసుకున్నాడు.

ఆ యాక్ష‌న్ మూవీని ఎన్టీఆర్ తో ప‌ట్టాలెక్కించ‌డానికి శౌర్యువ్ ఎన్నో ర‌కాలుగా ప్ర‌య‌త్నించాడు కానీ తార‌క్ షెడ్యూల్ ప‌లు సినిమాల‌తో లాక్ అయిపోవ‌డంతో ఈ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ అదే క‌థ‌తో మ‌రో హీరోని సంప్ర‌దించిన‌ట్టు తెలుస్తోంది. ఆ హీరో మ‌రెవ‌రో కాదు టాలీవుడ్ టాలెంటెడ్ హీరో, రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ.

ప్ర‌స్తుతం గౌత‌మ్ తిన్న‌నూరి తో కింగ్‌డ‌మ్ సినిమా చేస్తున్న విజ‌య్, ఆ త‌ర్వాత ర‌వికిర‌ణ్ కోలా తో ఓ సినిమా, రాహుల్ సాంకృత్స్య‌న్ తో ఓ సినిమాకు క‌మిట్ అయిన విష‌యం తెలిసిందే. ఈ రెండింటి త‌ర్వాత విజ‌య్ చేయ‌బోయే సినిమా శౌర్యువ్ తోనే అని స‌మాచారం. దీని గురించి ఇంకా అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ లేదు కానీ ఇప్ప‌టికే శౌర్యువ్- విజ‌య్ మ‌ధ్య డిస్క‌ష‌న్స్ ఆఖ‌రి ద‌శ‌కు చేరుకున్నాయంటున్నారు.

అయితే గ‌తంలో గౌత‌మ్ తిన్న‌నూరి, రామ్ చ‌ర‌ణ్ తో సినిమా చేయాల‌నే ఆలోచ‌న‌తో అత‌నికి ఓ క‌థ చెప్ప‌గా, అది అనౌన్స్‌మెంట్ వ‌ర‌కు వ‌చ్చి ఆగిపోయింది. అదే క‌థ‌ను గౌత‌మ్ ఇప్పుడు విజ‌య్ తో కింగ్‌డ‌మ్ పేరుతో తెర‌కెక్కిస్తుండ‌గా, ఇప్పుడు ఎన్టీఆర్ తో చేద్దామ‌ని శౌర్యువ్ రాసుకున్న క‌థ‌ను కూడా విజయే ఒప్పుకోవ‌డం విశేషం.