Begin typing your search above and press return to search.

వైఫ్ తో శౌర్య సూప‌ర్ క్లిక్!

నాగ‌శౌర్య-అనూష శెట్టి వివాహం గ‌తేడాది న‌వంబ‌ర్ లో గ్రాండ్ గా జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత వెకేష‌న్లు...హ‌నీమూన్లు అంటూ జంట అప్పుడ‌ప్పుడు మీడియాలో క‌నిపించేవారు.

By:  Tupaki Desk   |   13 Nov 2023 11:30 AM GMT
వైఫ్ తో శౌర్య సూప‌ర్ క్లిక్!
X

నాగ‌శౌర్య-అనూష శెట్టి వివాహం గ‌తేడాది న‌వంబ‌ర్ లో గ్రాండ్ గా జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత వెకేష‌న్లు...హ‌నీమూన్లు అంటూ జంట అప్పుడ‌ప్పుడు మీడియాలో క‌నిపించేవారు. కానీ వైఫ్ తో ఇంటి వాతావ‌ర‌ణాన్ని మాత్రం నాగ‌శౌర్య పెద్ద‌గా షేర్ చేసుకోలేదు. సినిమా..ఫ్యామిలీ లైఫ్ ని పూర్తిగా స‌ప‌రేట్ చేసిన న‌టుడు. సెట్స్ లో ఉన్నంత సేపు సినిమా. ఇంటికొస్తే ఫ్యామిలీ స్టార్ లా మారిపోవ‌డంతో ! త‌ప్ప త‌న సినిమా వ్య‌వ‌హ‌రలేవి భార్య‌పై రుద్దింది లేదు.


అనూష కూడా సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉండ‌రు. ఇంటి ప‌ట్టున ఉంటూనే కుటుంబ బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్నారు. తాజాగా దీపావ‌ళిని పుర‌స్క‌రించుకుని ఈ జోడీ దిగిన ఓ ఫోటోని నాగ‌శౌర్య ఇన్ స్టాలో షేర్ చేసాడు. ఇందులో నాగ‌శౌర్య న‌లుపు రంగు దుస్తుల్లో క‌నిపిస్తుండ‌గా...ఆయ‌న భార్య ప‌సుపు వ‌ర్ణం ట్రెడీష న‌ల్ దుస్తుల్లో క‌నిపిస్తున్నారు. భార్యా-భ‌ర్త‌లు ఇద్ద‌రు స‌ర‌దాగా దిగిన పిక్ ఇది. ఇల్లు ఎంతో గ్రాండియ‌ర్ గా ఉంది.


ఈ విష‌యంలో నాగ‌శౌర్య మామ్ స్పెష‌లిస్ట్. ఇంటిని ఎలా చ‌క్క‌దిద్దాలో ఆమెకి బాగా తెలుసు. ఇంటి మొత్తాన్ని ఆమె డెక‌రేట్ చేస్తారు. ఆమె టేస్ట్ తెలిసిన వారంతా మంచి ఇంటిరీయ‌ర్ డిజైన‌ర్ అంటారు. ప్ర‌స్తుతం ఈ ఫోటో నెట్టింట వైర‌ల్ గా మారింది. నాగ‌శౌర్య‌-అనూష దంప‌తుల ముచ్చ‌టికి అభిమానులు ఫిదా అవుతున్నారు. పెళ్లికి ముందు త‌న‌యుడితో ఎక్కువ‌గా మామ్ క‌నిపించేవారు. ఇప్పుడామె హైడ్ అయ్యారు.

ఇక యంగ్ హీరో సినిమాలో బిజీగా ఉన్నాడు. ప్ర‌స్తుతం మూడు సినిమ‌లు సెట్స్ లో ఉన్నాయి. `ఎన్ ఎస్ 24`..`నారీ నారీ న‌డుమ మురారీ`...`పోలీసు వారి హెచ్చ‌రిక` చిత్రాల్లో న‌టిస్తున్నాడు. చివ‌రి రెండు చిత్రాలు షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో ఉన్నాయి. ఎన్ ఎస్ 24 షూటింగ్ ద‌శ‌లో ఉంది.