Begin typing your search above and press return to search.

ఆ సీక్వెల్ లో శర్వానంద్ కష్టమేనా..?

ఇదిలా ఉంటే ఈ సంక్రాంతికి దిల్ రాజు నెక్స్ట్ పొంగల్ రిలీజ్ చేసే సినిమా అనౌన్స్ మెంట్ ఇచ్చారు

By:  Tupaki Desk   |   16 Jan 2024 12:30 PM GMT
ఆ సీక్వెల్ లో శర్వానంద్ కష్టమేనా..?
X

2017 సంక్రాంతికి వచ్చి సూపర్ హిట్ అందుకున్న శతమానం భవతి సినిమా ఆ సీజన్ లో రిలీజైన రెండు పెద్ద సినిమాల మధ్య మంచి హిట్ అందుకుంది. సంక్రాంతికి ఎన్ని పెద్ద సినిమాలు వచ్చినా ఫ్యామిలీస్ అంతా కూడా మంచి సినిమాను ఆదరిస్తారని ఆ సినిమాతో ప్రూవ్ అయ్యింది. ఇక శతమానం భవతి తర్వాత సంక్రాంతి సీజన్ లో ఏదో ఒక ఫ్యామిలీ మూవీ రిలీజ్ అవుతూ వస్తుంది. ఈ సంక్రాంతికి నాగార్జున నా సామిరంగ సినిమా రిలీజై మంచి టాక్ తెచ్చుకుంది. సంక్రాంతికి ఫ్యామిలీ అంతా చూసే సినిమా వస్తే మాత్రం పక్కా హిట్ అన్నట్టే లెక్క.

ఇదిలా ఉంటే ఈ సంక్రాంతికి దిల్ రాజు నెక్స్ట్ పొంగల్ రిలీజ్ చేసే సినిమా అనౌన్స్ మెంట్ ఇచ్చారు. శతమానం భవతి నెక్స్ట్ పేజి అంటూ శతమానం భవతి సీక్వెల్ ని ప్రకటించారు. సతీష్ వేగేశ్న డైరెక్షన్ లో తెరకెక్కిన శతమానం భవతి సినిమా సీక్వెల్ నెక్స్ట్ పేజీ లో ఎవరెవరు ఉంటారన్నది చర్చ కొనసాగుతుంది. ఈ సీక్వెల్ లో హీరో శర్వానంద్ చేస్తాడా లేదా అన్నది డిస్కషన్ నడుస్తుంది.

2017 లో శర్వానంద్ కి శతమానం భవతి మంచి హిట్ అందించింది. అయితే ఆ సినిమాలో అతని కన్నా మిగతా నటీనటులకు ఎక్కువ స్కోప్ ఉండటం.. సినిమా హిట్ లో తను ఒక భాగం మాత్రమే అవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ సీక్వెల్ లో శర్వానంద్ ఉంటాడా లేదా అన్నది డౌట్ గానే ఉంది. శర్వానంద్ తో పాటుగా మిగతా నటీనటులు ఎవరెవరు ఉంటాన్నది తెలియాల్సి ఉంది. నిర్మాత దిల్ రాజు ప్లానింగ్ ఎలా ఉంది అన్నది బయటకు రావాల్సి ఉంది.

శర్వానంద్ తో పాటుగా శతమానం భవతి టీం అంతా కూడా ఈ సీక్వెల్ కి పనిచేస్తే ఆ వైబ్ వేరే రేంజ్ లో ఉంటుంది. ప్రకాశ్ రాజ్, జయసుధ అయితే కచ్చితంగా చేసే అవకాశం ఉంది. ఇక ఎటొచ్చి హీరో హీరోయిన్స్ విషయంలోనే కన్ ఫ్యూజన్ కొనసాగుతుంది. డైరెక్టర్ సతీష్ వేగేశ్న కూడా పెద్దగా ఫాం లో లేడు. శతమానం భవతి తర్వాత ఆయన చేసిన శ్రీనివాస కళ్యాణం కూడా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. ఆ తర్వాత ఎంతమంచివాడవురా కూడా ఫ్లాప్ అయ్యింది. మరి ఈ టైం లో శతమానం భవతి సీక్వెల్ ఎలా ఉండబోతుందో చూడాలి.