Begin typing your search above and press return to search.

దిల్ రాజు కథతో ఆ సీక్వెల్.. డైరెక్టర్ కూడా చేంజ్..?

ఈ సీక్వెల్ కు మూల కథ దిల్ రాజు అందించారని తెలుస్తుంది. అంతేకాదు ఈ సీక్వెల్ డైరెక్టర్ కూడా మారాడట.

By:  Tupaki Desk   |   2 March 2024 2:30 PM GMT
దిల్ రాజు కథతో ఆ సీక్వెల్.. డైరెక్టర్ కూడా చేంజ్..?
X

సక్సెస్ ఫుల్ నిర్మాతగా రెండు దశాబ్దాలకు పైగా తన బ్యానర్ లో సినిమాలు చేస్తున్న దిల్ రాజు కథల విషయంలో జడ్జిమెంట్ బాగా చేస్తాడు. సినిమా కథ విని వర్క్ అవుట్ అవుతుందా లేదా అని చేసే చాలా తక్కువమంది వారిలో దిల్ రాజు ఒకరు. అయితే కొన్నిసార్లు ఆయన అంచనాలు తప్పినా చాలాసార్లు ఆయన జడ్జిమెంట్ ఫెయిల్ అవ్వలేదు. లాస్ట్ ఇయర్ వచ్చిన బలగం సినిమా తో కూడా ఆయన జడ్జిమెంట్ ఎలాంటిందో మరోసారి ప్రూవ్ అయ్యింది. ఇక వందల కొద్దీ కథలను విన్న దిల్ రాజు స్వతహాగా అతను కూడా కథకుడిగా మారాడని తెలుస్తుంది.

చాలా సినిమాల్లో కొత్త దర్శకులకు కథ విషయంలో కొన్ని ఇంపార్టెంట్ ఇన్ పుట్స్ దిల్ రాజు అందించారని ఫిల్మ్ నగర్ టాక్. ఆయన ఇచ్చిన సలహాల వల్ల సినిమాలు భారీగా వర్క్ అవుట్ అయినవి ఉన్నాయి. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు దిల్ రాజు ఒక కథ రెడీ చేసి తన నిర్మాణంలో సినిమా చేస్తున్నారని తెల్సుతుంది. 2017 లో వచ్చిన శతమానం భవతి సినిమా సీక్వెల్ గా శతమానం భవతి నెక్స్ట్ పేజ్ సినిమా అనౌన్స్ చేశారు దిల్ రాజు.

ఈ సీక్వెల్ కు మూల కథ దిల్ రాజు అందించారని తెలుస్తుంది. అంతేకాదు ఈ సీక్వెల్ డైరెక్టర్ కూడా మారాడట. శతమానం భవతి సినిమాను సతీష్ వేగేశ్న డైరెక్ట్ చేయగా ఈ సీక్వెల్ ని హరి డైరెక్ట్ చేస్తాడని తెలుస్తుంది. దిల్ రాజు బ్యానర్ లో ఎన్నో సినిమాలకు అసోసియేట్ గా పనిచేసిన హరి శతమానం భవతి సీక్వెల్ ని డైరెక్ట్ చేస్తాడని తెలుస్తుంది. దిల్ రాజు ఇచ్చిన లైన్ ను హరి చేసిన డెవెలప్ మెంట్ నచ్చడంతో అతన్నే డైరెక్టర్ గా పరిచయం చేస్తున్నాడట దిల్ రాజు.

ఈ సినిమాను 2025 సంక్రాంతికి రిలీజ్ అని ముందే ప్రకటించారు. అయితే ప్రస్తుతం వెంకటేష్ తో దిల్ రాజు చేయబోతున్న ప్రాజెక్ట్ కి టైటిల్ గా సంక్రాంతికి వస్తున్నాం టైటిల్ లాక్ చేశారట. ఆ సినిమా సంక్రాంతికి వస్తే.. శతమానం భవతి 2 సంక్రాంతి మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి దిల్ రాజు ప్లానింగ్ ఏంటో కానీ ఇన్నాళ్లు నిర్మాతగా ఉన్న ఆయన కథకుడిగా మారడం ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుంది.