యువన్ - ఇళయరాజా కాంబో.. ఈ పాట విన్నారా?
అయితే ఆ సాంగ్ కోసం లెజండరీ స్వరకర్త ఇళయరాజా, యువన్ శంకర్ రాజా వర్క్ చేయడం విశేషం.
By: Tupaki Desk | 11 May 2025 1:53 PM ISTటాలీవుడ్ సీనియర్ నటీనటులు రాజేంద్ర ప్రసాద్, అర్చన చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత జోడీగా షష్టిపూర్తి మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. అదే సమయంలో ఆ చిత్రంలో యువ జంటగా రూపేష్, ఆకాంక్ష సింగ్ యాక్ట్ చేస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న షష్టిపూర్తి మూవీకి పవన్ ప్రభ దర్శకత్వం వహిస్తున్నారు.
ఆయి ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపేష్ నిర్మిస్తున్న ఆ మూవీకి మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా సంగీత దర్శకుడిగా వర్క్ చేస్తున్నారు. అదే సమయంలో ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న మూవీ రిలీజ్ కు సిద్ధమవుతోంది. మే 30వ తేదీన సినిమాను థియేటర్స్ లో విడుదల చేయనున్నారు మేకర్స్. ప్రమోషన్స్ కూడా నిర్వహిస్తున్నారు.
ఇప్పటికే మూవీపై ఆడియన్స్ లో పాజిటివ్ బజ్ క్రియేట్ అవ్వగా.. వరుసగా అప్డేట్స్ తో సందడి చేస్తున్నారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన సాంగ్స్ తో మంచి అంచనాలు నెలకొల్పారు. తాజాగా మరో సాంగ్ రాత్రంతా రచ్చే పాట ప్రోమోను రిలీజ్ చేశారు. అందులో రూపేష్, ఆకాంక్ష సింగ్ ఇద్దరూ రొమాంటిక్ స్టెప్పులతో మెప్పించారు.
అయితే ఆ సాంగ్ కోసం లెజండరీ స్వరకర్త ఇళయరాజా, యువన్ శంకర్ రాజా వర్క్ చేయడం విశేషం. తెలుగులో మొట్టమొదటిసారిగా యువన్ తన తండ్రి స్వరపరిచిన పాటకు తన స్వరాన్ని అందించారు. ఆయనతోపాటు నిత్యశ్రీ గాత్రం కలిపారు. దీంతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెమోరబుల్ సాంగ్ గా రాత్రంతా రచ్చే సాంగ్ నిలిచింది.
షష్టిపూర్తి మూవీకి గాను ఈడో ఎడెడు పాట కోసం ఇళయరాజా, ఆస్కార్ విజేత ఎం ఎం కీరవాణి కలిసి వర్క్ చేశారు. ఇళయరాజా మ్యూజిక్ అందించగా, కీరవాణి సాహిత్యం అందించారు. ఇప్పటికే ఆ విషయం వార్తల్లో నిలిచింది. ఇప్పుడు ఇళయరాజా, యువన్ కాంబినేషన్ సినిమా సంగీత ఆకర్షణను మరింత పెంచుతుంది.
అలా సినిమాకు సాంగ్స్ తో ఆడియన్స్ లో మంచి బచ్ నెలకొంది. టీజర్ కూడా సూపర్ రెస్పాన్స్ సంపాదించుకుంది. అవుట్ పుట్ అద్భుతంగా వచ్చిందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. సమ్మర్ కు మంచి ఫీల్ గుడ్ మూవీతో వీడ్కోలు టాలీవుడ్ చెప్పనున్నట్లు తెలుస్తోంది. ట్రైలర్ ను త్వరలో రిలీజ్ చేయనున్నారు. మరి షష్టిపూర్తి సినిమా ఎలా ఉంటుందో.. ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.
