Begin typing your search above and press return to search.

బుడ్డోడితో శర్వా రంగులు.. ఇదేదో కొత్తగా ఉందే..

టాలీవుడ్ ఇండస్ట్రీలో రాముడు మంచి బాలుడు అనే మాట శర్వానంద్ కు వర్తిస్తుందేమో అనిపిస్తూ ఉంటుంది

By:  Tupaki Desk   |   6 March 2024 7:42 AM GMT
బుడ్డోడితో శర్వా రంగులు.. ఇదేదో కొత్తగా ఉందే..
X

టాలీవుడ్ ఇండస్ట్రీలో రాముడు మంచి బాలుడు అనే మాట శర్వానంద్ కు వర్తిస్తుందేమో అనిపిస్తూ ఉంటుంది. అంతగా అతను ఎలాంటి కాంట్రవర్సీలు లేకుండా చాలా కూల్ గా మంచి గుర్తింపును అందుకున్నాడు ఒక సినిమా చేయడానికి సంతకం చేస్తే అది పూర్తయ్యే వరకు కూడా ఎంతో నిబద్ధతతో వర్క్ చేస్తూ ఉండే హీరోల్లో శర్వానంద్ ఒకరు. శర్వా నుంచి ఒక సినిమా వస్తుంది అంటే తప్పకుండా అందులో ఏదో ఒక కొత్త తరహా కంటెంట్ ఉంటుంది అని చెప్పవచ్చు.

అంతేకాకుండా ఫ్యామిలీ మొత్తం కూర్చుని చూసేలా సినిమాలు చేయడంలో అతని స్టైలే వేరు. ఇక ఈరోజు అతని పుట్టినరోజు సందర్భంగా మరొక సినిమాకు సంబంధించిన అప్డేట్ వదిలారు. శర్వానంద్ తన 35వ సినిమాను యువ దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య తో చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ పై క్లారిటీ ఇచ్చేశారు.

ఈ సినిమాకు మనమే అనే టైటిల్ ఖరారు చేశారు. ఇక వరల్డ్ ఆఫ్ మనమే.. అంటూ ఒక వీడియోని విడుదల చేయగా అందులో లండన్ నగరంలోని అద్భుతమైన ప్రదేశాలపై రంగులు పడేలా చూపించారు. ఇక చివరిగా ఒక బిల్డింగ్ పై రంగులు వేసే వ్యక్తిగా శర్వానంద్ కనిపించగా అతని పక్కనే ఒక బుడ్డోడు కూడా పెయింటర్ డ్రెస్ తో కనిపిస్తూ ఉన్నాడు.

ఇక ఈ వీడియో చివరలో 'ఐ థింక్ ఇట్స్ టైమ్ ఫర్ షాంపేన్ టైం' అంటూ శర్వానంద్ చెప్పిన డైలాగ్ కి హీరోయిన్ కీర్తి అతని వైపు ఒక్కసారిగా తిరిగి చూస్తుంది. చూస్తుంటే సినిమా మాత్రం రోమ్ కామ్ తరహాలో ఉండబోతున్నట్లుగా అర్థమవుతుంది. మనమే.. సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. పీపుల్స్ వీడియో ఫ్యాక్టరీ పై విశ్వప్రసాద్ సమర్పణలో వివేక్ నిర్మిస్తున్న ఈ సినిమా విడుదల డేట్ పై కూడా త్వరలోనే క్లారిటీ ఇవ్వనున్నారు.

ట్రేండింగ్ మెలోడీ మ్యూజిక్ డైరెక్టర్ హేషామ్ అబ్దుల్ వహాబ్ ఈ సినిమాకి మ్యూజిక్ అందిఅటున్నారు. టైటిల్ ఎనౌన్స్ మెంట్ వీడియో లో కూడా అతని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఇక చాలాకాలంగా సక్సెస్ లేక కాస్త తడబడుతున్న హీరో శర్వానంద్ కు ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకోవాలని అనుకుంటున్నాడు. మరి ఈ సినిమాను ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తారో చూడాలి.