Begin typing your search above and press return to search.

'BOB' అంటూ రాబోతున్న యంగ్‌ హీరో..!

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌ లో రూపొందుతున్న ఈ సినిమాకు 'BOB' అనే టైటిల్‌ ను ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి.

By:  Tupaki Desk   |   27 Dec 2023 9:50 AM GMT
BOB అంటూ రాబోతున్న యంగ్‌ హీరో..!
X

యంగ్‌ హీరో శర్వానంద్‌ ప్రస్తుతం శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఒక సినిమా ను చేస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమా షూటింగ్‌ కార్యక్రమాలు ముగింపు దశకు చేరుకున్నాయనే వార్తలు వస్తున్నాయి. ఇదే సమయంలో సినిమా టైటిల్‌ ను ఖరారు చేసేందుకు గాను దర్శకుడు శ్రీరామ్‌ ఆదిత్య సిద్ధం అవుతున్నాడని సమాచారం.

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌ లో రూపొందుతున్న ఈ సినిమాకు 'BOB' అనే టైటిల్‌ ను ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య విభిన్నమైన కాన్సెప్ట్‌ తో ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. కనుక టైటిల్ కూడా కాస్త విభిన్నంగా ఉండే విధంగా ప్లాన్‌ చేశాడట.

శర్వానంద్ గత చిత్రాల ఫలితాలతో సంబంధం లేకుండా ఈ సినిమా కు నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా వారు భారీగా ఖర్చు చేస్తున్నారట. దర్శకుడు శ్రీరామ్‌ ఆదిత్య కాన్సెప్ట్‌ కు కాస్త ఎక్కువ బడ్జెట్‌ ను పెట్టాల్సి వచ్చిందట. అందుకే పీపుల్స్ మీడియా వారు కాస్త ఎక్కువగానే ఖర్చు చేశారని సమాచారం అందుతోంది.

'BOB' అనే టైటిల్‌ కు అర్థం ఏంటి... అసలు ఆ టైటిల్‌ ను ఎందుకు పెట్టాల్సి వచ్చింది అనేది విడుదలకు ముందే దర్శకుడు శ్రీరామ్‌ ఆదిత్య క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి. మొత్తానికి శర్వానంద్‌ మరియు శ్రీరామ్ ఆదిత్య కాంబో మూవీ మరో రేంజ్ లో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ గా కృతి శెట్టి నటిస్తున్న విషయం తెల్సిందే.