Begin typing your search above and press return to search.

ఇంతకి శర్వానంద్ ఏం చేస్తున్నాడు?

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్.. ఈ మధ్యకాలంలో నటిస్తున్న సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద వరుసగా ప్లాప్స్ అవుతున్నాయి.

By:  Tupaki Desk   |   14 Feb 2024 8:10 AM GMT
ఇంతకి శర్వానంద్ ఏం చేస్తున్నాడు?
X

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్.. ఈ మధ్యకాలంలో నటిస్తున్న సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద వరుసగా ప్లాప్స్ అవుతున్నాయి. మహానుభావుడు, శతమానం భవతి సినిమాల తర్వాత మళ్లీ ఆ రేంజ్ సక్సెస్ ను ఇప్పటి వరకు అందుకోలేకపోయారు. ఈ చిత్రాల తర్వాత శర్వానంద్ నటించిన పడి పడి లేచే మనసు, జాను, శ్రీకారం, ఆడవాళ్లు మీకు జోహార్లు వంటి సినిమాలన్నీ నిరాశే మిగిల్చాయి.

ఇక శర్వా గతేడాది నటించిన ఒకే ఒక జీవితం పర్వాలేదనిపించింది. అయితే ఈసారి ఎలాగైనా భారీ కమ్ బ్యాక్ ఇవ్వాలని పట్టుదలతో ఉన్నారు. ఈ నేపథ్యంలో కాస్త ఆలస్యమైనా కథల విషయంలో జాగ్రత్త పడుతున్నారు. ప్రస్తుతం శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో శర్వా.. ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ యంగ్ హీరో మరో సినిమాను సైలెంట్ గా స్టార్ చేసేశారు.

ఎలాంటి హడావుడి లేకుండా పూజా కార్యక్రమాలు కూడా జరిగిపోయాయి. అంతే కాదు రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ట్ అయింది. లూజర్‌ వెబ్ సిరీస్ తో మంచి పేరు తెచ్చుకున్న అభిలాష్ రెడ్డితో నెక్స్ట్ మూవీ చేస్తున్నారు శర్వానంద్. మాళవిక నాయర్ హీరోయిన్ గా నటిస్తోంది. గత కొద్ది రోజులుగా ఈ ప్రాజెక్ట్ పై రూమర్లు వినిపిస్తున్నా.. ఎలాంటి సౌండ్ లేకుండా మేకర్స్ స్టార్ట్ చేసేశారు. యూవీ క్రియేషన్స్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఫస్ట్ షూటింగ్ షెడ్యూల్ మార్చి 1వ తేదీకి కంప్లీట్ అవ్వనుందట.

మరోవైపు, శర్వానంద్ మరో డైరెక్టర్ కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్లాపుల్లో ఉన్న శ్రీవిష్ణు కు సామజవరగమన సినిమాతో బ్లాక్ బస్టర్ అందించిన రామ్ అబ్బరాజుతో చేతులు కలపనున్నారట. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందట. అయితే సామజవరగమన థియేటర్స్ లో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.50 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుంది.

శర్వానంద్- రామ్ అబ్బరాజు ప్రాజెక్ట్ ను అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ రెండు సినిమాల్లో.. ఏ మూవీ శర్వాకు గట్టి కమ్ బ్యాక్ ఇస్తుందో చూడాలి మరి.