Begin typing your search above and press return to search.

శర్వానంద్ భలే టైటిల్ పట్టాడే..!

ఈ మధ్య కాలంలో సినిమాల సక్సెస్ ల్లో టైటిల్స్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి

By:  Tupaki Desk   |   2 Aug 2023 10:40 AM GMT
శర్వానంద్ భలే టైటిల్ పట్టాడే..!
X

ఈ మధ్య కాలంలో సినిమాల సక్సెస్ ల్లో టైటిల్స్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. టైటిల్‌ ఎంతగా ప్రేక్షకులకు రీచ్‌ అయితే అంతగా సినిమా కు మంచి ఓపెనింగ్స్ దక్కడం... మంచి పబ్లిసిటీ దక్కడం జరుగుతుంది. సినిమా బాగున్నా కూడా టైటిల్ విషయంలో కొన్ని సార్లు నిరాశ ఎదురైన విషయం తెల్సిందే.

అందుకే సినిమా టైటిల్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. క్యాచీ టైటిల్స్ ను పెట్టాలి అనే ఉద్దేశ్యంతో క్రియేటివిటీగా ఆలోచిస్తూ టాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్స్ కొత్తగా ఆలోచిస్తున్నారు. శర్వానంద్‌ హీరోగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాకు విభిన్నమైన టైటిల్ ను పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

'బాబ్‌' (బేబీ ఆన్ బోర్డ్‌) అనే టైటిల్‌ ను శర్వానంద్‌ సినిమా కోసం శ్రీరామ్ ఆదిత్య పరిశీలిస్తున్నాడు అంటూ సమాచారం అందుతోంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో శర్వానంద్ పాత్ర విభిన్నంగా ఉండటంతో పాటు వినోదాత్మకంగా ఉంటుందట. అందుకే ఈ టైటిల్ ను ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది.

ఈ సినిమాలో హీరోయిన్‌ గా కృతి శెట్టి నటిస్తోంది. శర్వా గత చిత్రం ఒకే ఒక్క జీవితం విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. కానీ కమర్షియల్‌ గా మాత్రం విజయాన్ని సొంతం చేసుకోలేక పోయింది. దాంతో ప్రస్తుతం చేస్తున్న ఈ సినిమా పై శర్వా అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌ పై ఈ సినిమా రూపొందుతోంది.