Begin typing your search above and press return to search.

హద్దులు దాటుతున్న ఆ హీరో మూవీ బడ్జెట్?

శర్వానంద్ హీరోగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఒక మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది

By:  Tupaki Desk   |   24 Oct 2023 4:20 AM GMT
హద్దులు దాటుతున్న ఆ హీరో మూవీ బడ్జెట్?
X

శర్వానంద్ హీరోగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఒక మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. కృతి శెట్టి హీరోయిన్ గా చేస్తోన్న సంగతి తెలిసిందే. గత కొంత కాలం నుంచి శర్వానంద్ కి సాలిడ్ హిట్ పడలేదు. మంచి కథలు ఎంచుకొని మూవీస్ చేస్తోన్న ఎందుకో ప్రేక్షకులకి రీచ్ కావడంలో మాత్రం అవి ఫెయిల్ అవుతున్నాయి.

యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో చేసిన, ఫ్యామిలీ కంటెంట్ ఎంచుకుంటున్న ఫ్లాప్ మాత్రం పక్కా వస్తోంది. దీంతో శర్వానంద్ మార్కెట్ వేల్యూ కూడా డ్రాప్ అవుతూ వస్తోంది. కనీసం మంచి ఓపెనింగ్స్ కూడా తెచ్చుకోలేకపోతున్నారు. చివరిగా శర్వానంద్ నుంచి గత ఏడాది ఆడాళ్ళు మీకు జోహార్లు సినిమా వచ్చింది. ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది.

కొంత గ్యాప్ తీసుకొని శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో మూవీని సెట్స్ పైకి తీసుకొని వెళ్ళారు. ఈ సినిమా ఇప్పటికే 70 శాతం షూటింగ్ కంప్లీట్ అయ్యిందంట. ఇంకా 30 శాతం పెండింగ్ ఉంది. అయితే సినిమా బడ్జెట్ మాత్రం అనుకున్న దానికంటే ఎక్కువ అవుతోందని టాక్ వినిపిస్తోంది. మొత్తం మూవీ కంప్లీట్ అయ్యే సమయానికి 40-50 కోట్ల వరకు బడ్జెట్ ఖర్చయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయంట.

శర్వానంద్ పైన ఈ స్థాయిలో బడ్జెట్ అంటే ప్రస్తుత పరిస్థితులో చాలా కష్టం అని చెప్పాలి. టీజర్, ట్రైలర్ ఎంతో అద్భుతంగా ఉండి సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయితేనే థీయాట్రికల్, నాన్ థీయా ట్రికల్ ద్వారా ఈ స్థాయిలో బిజినెస్ జరిగే అవకాశం ఉంది. శ్రీరామ్ ఆదిత్య మొదటి మూడు సినిమాలు అంత గొప్ప రికార్డులు సృష్టించినవి అయితే కాదు.

కాని కంటెంట్ మీద నమ్మకంతో పీపుల్స్ మీడియా భారీ బడ్జెట్ పెట్టడానికి సిద్ధమైన అది అనుకున్న దానికంటే ఎక్కువ అవుతోంది. ఫెయిల్యూర్ లో ఉన్న హీరో, దర్శకుడి మీద ఈ స్థాయిలో బడ్జెట్ అంటే పెద్ద రిస్క్ అని ట్రేడ్ పండితుల మాట. పీపుల్స్ మీడియా ఇలా మినిమం రేంజ్ హీరోల విషయంలో బడ్జెట్ పరిధులు చూసుకొని సినిమాలు చేయాలని లేదంటే రిస్క్ పేస్ చేయాల్సి వస్తోందని సినీ విశ్లేషకులు అంటున్న మాట.