Begin typing your search above and press return to search.

9 ఏళ్ల తర్వాత హిట్ కాంబో రిపీట్..!

సినిమాలో శర్వానంద్ కి జోడీగా కృతి శెట్టిని ఫిక్స్ చేయగా ఆమెతో పాటుగా ఇప్పుడు మరో హీరోయిన్ కూడా నటిస్తుందని టాక్

By:  Tupaki Desk   |   1 Sep 2023 6:08 AM GMT
9 ఏళ్ల తర్వాత హిట్ కాంబో రిపీట్..!
X

యువ హీరోల్లో సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న శర్వానంద్ చేస్తున్న సినిమాలన్నీ కొన్ని మిశ్రమ ఫలితాలు అందిస్తుంటే మరికొన్ని ఫ్లాపులు చవిచూస్తున్నాయి. అందుకే స్టోరీ సెలక్షన్ మీద మరింత ఫోకస్ పెట్టిన శర్వానంద్ సెలెక్టెడ్ సినిమాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్ లో శర్వానంద్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో టీజీ విశ్వప్రసాద్ వివేక్ కూచిబొట్ల ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఖుషితో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ హేషం అబ్దుల్ వహాబ్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు.

సినిమాలో శర్వానంద్ కి జోడీగా కృతి శెట్టిని ఫిక్స్ చేయగా ఆమెతో పాటుగా ఇప్పుడు మరో హీరోయిన్ కూడా నటిస్తుందని టాక్. శర్వానంద్ 35వ సినిమాగా వస్తున్న ఈ మూవీలో సీరత్ కపూర్ కూడా ఉంటుందని తెలుస్తుంది. సినిమాలో ఆమెది ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ అని టాక్. శర్వానంద్ తో సీరత్ కపూర్ ఆల్రెడీ రన్ రాజా రన్ సినిమాలో నటించింది. యువి క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమాను సుజిత్ డైరెక్ట్ చేశారు.

శర్వానంద్ సీరత్ కపూర్ జంటగా నటించిన రన్ రాజా రన్ హిట్ అందుకుంది. అయితే ఆ సినిమా తర్వాత 9 ఏళ్లకు మళ్లీ ఈ ఇద్దరు కలిసి నటిస్తున్నారు. లాస్ట్ ఇయర్ ఆడవాళ్లు మీకు జోహార్లు, ఒకే ఒక జీవితం సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శర్వానంద్ ఆ రెండు సినిమాలతో కూడా సక్సెస్ అందుకోలేదు. మరి శ్రీరామ్ ఆదిత్య సినిమాతో అయినా హిట్ కొడతాడా లేదా అన్నది చూడాలి. కృతి శెట్టి కూడా తెలుగులో మరో హిట్ కోసం ఎదురుచూస్తుంది. చేస్తున్న సినిమాలన్నీ ఫ్లాప్ అవడంతో అమ్మడు కూడా డీలా పడింది. అయితే శర్వానంద్ సినిమాల్లో హీరోయిన్ పాత్రలకు మంచి మైలేజ్ ఉంటుంది కాబట్టి ఈ సినిమాతో కృతి శెట్టి కూడా తిరిగి ఫాంలోకి వస్తుందని చెప్పొచ్చు. కృతి శెట్టి సీరత్ కపూర్ ఇద్దరు హీరోయిన్స్ తో శర్వానంద్ సినిమా కలర్ ఫుల్ గా ఉండబోతుందని అర్థమవుతుంది.

ఓ పక్క యంగ్ హీరోలంతా డిఫరెంట్ కాన్సెప్ట్ తో పాన్ ఇండియా అటెంప్ట్ చేస్తుంటే శర్వానంద్ మాత్రం హిట్ రేసులో వెనుకబడి ఉన్నాడు. సరైన సినిమా పడితే తన స్టామినా ఏంటన్నది ప్రూవ్ చేసుకోవాలని ఉత్సాహంగా ఉన్నాడు శర్వానంద్. మరి రాబోయే సినిమాలతో అయినా శర్వానంద్ సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది.