Begin typing your search above and press return to search.

శర్వా.. కల్కి వదిలేసిన డేట్ అంటే కష్టమే!

యంగ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ చివరిగా ఒకే ఒక జీవితం సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు.

By:  Tupaki Desk   |   17 April 2024 5:30 PM GMT
శర్వా.. కల్కి వదిలేసిన డేట్ అంటే కష్టమే!
X

యంగ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ చివరిగా ఒకే ఒక జీవితం సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా ఎమోషనల్ డ్రామాతో ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యింది. ప్రస్తుతం శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో చేసిన మనమే మూవీతో ప్రేక్షకుల ముందుకి రావడానికి సిద్ధం అవుతున్నాడు. కీర్తి శెట్టి ఈ చిత్రంలో శర్వానంద్ కి జోడీగా నటించింది. తండ్రి కొడుకుల అనుబంధం నేపథ్యంలో ఈ చిత్రాన్ని శ్రీరామ్ ఆదిత్య సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించారు.

ఇప్పటి వరకు వచ్చిన మూవీ టైటిల్ టీజర్, ఫస్ట్ సాంగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. కచ్చితంగా శర్వానంద్ కెరియర్ లో ఇదొక క్లాసిక్ మూవీగా మారుతుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. శ్రీరామ్ ఆదిత్య మేకింగ్ స్టైల్ కంప్లీట్ డిఫరెంట్ గా ఉంటుంది. అలాగే కథనంలో కొత్తదనం ఉంటుంది. ఈ కారణంగానే మనమే సినిమాపై పాజిటివ్ వైబ్ ఉంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

ఏప్రిల్ 26న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని అనుకుంటున్నట్లు ఆ మధ్య ఒక టాక్ వచ్చింది. ఇక ఇప్పుడు నిర్మాతలు కల్కి డేట్ పై ఫోకస్ చేసినట్లు ఇండస్ట్రీలో మరో కొత్త గాసిప్ వైరల్ అవుతోంది. అయితే గతంలో కల్కి 2898ఏడీ మూవీ మే 9న రిలీజ్ ప్రకటించారు. ఎలక్షన్స్ కారణంగా మూవీ ఓపెనింగ్స్, కలెక్షన్స్ మీద ప్రభావం ఉంటుందని చిత్ర యూనిట్ భావించింది. దేశ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. కల్కి మూవీ కూడా దేశ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో ఆ మూవీని వాయిదా వేశారు. ఏప్రిల్ 18న కొత్త రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేస్తారని తెలుస్తోంది.

కల్కి రిలీజ్ నుంచి తప్పుకోవడంతో ఇప్పుడు శర్వానంద్ మనమే చిత్రానికి స్పేస్ ఉంటుందని.. మేకర్స్ ఆ డేట్ గురించి ఆలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. ఈ సినిమాని కేవలం తెలుగులో మాత్రమే రిలీజ్ చేస్తున్నప్పటికి ఎలక్షన్స్ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో అనే సందేహాలు కూడా కలుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలలో ఈ సమయంలో సినిమా కంటే రాజకీయం పబ్లిక్ లో ఎక్కువ ఆసక్తి కలిగించే అంశంగా ఉంది. ఈ నేపథ్యంలో ఎలక్షన్స్ ఇంపాక్ట్ శర్వానంద్ సినిమాపై పడే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంటున్నారు.

దానికి తోడు ఆ తరువాత వారమే విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా కూడా రిలీజ్ కానుంది. ఆ సినిమాపై పాజిటివ్ బజ్ ఉంది. ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. అలాగే విశ్వక్ కూడా మంచి ఫామ్ లో ఉన్నాడు. గామి సక్సెస్ తోనే అతని సెలెక్ట్ చేసుకునే కంటెంట్ ఎంత డిఫరెంట్ గా ఉంటుందో అర్ధమవుతుంది. కాబట్టి GOG బాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపే అవకాశం ఉంది.

కాబట్టి శర్వా సినిమా అదే డేట్ కు వస్తుందా లేదంటే మరొక డేట్ ను ఫిక్స్ చేసుకుంటుందా అనేది చూడాలి. ఇక ఇప్పటి వరకు మూవీ రెగ్యులర్ ప్రమోషన్స్ స్టార్ట్ చేయలేదు. ఈ మధ్యాకాలంలో సినిమాకి స్ట్రాంగ్ ప్రమోషన్ చేస్తేకాని సరైన ఓపెనింగ్స్ రావడం లేదు. కానీ శర్వానంద్ ఇప్పటి వరకు ఈ సినిమా ప్రమోషన్స్ కోసం బయటకి రాలేదు. ఈ నేపథ్యంలో మనమే వాయిదా పడే అవకాశం ఉందనే ప్రచారం నడుస్తోంది. మరి దీనిపై చిత్ర యూనిట్ ఎలా రియాక్ట్ అవుతుందనేది చూడాలి.