Begin typing your search above and press return to search.

మెగాస్టార్ లో ఉన్న ప్ర‌తీ క్వాలిటీ మెగాప‌వ‌ర్ స్టార్ లో!

రామ్ చ‌ర‌ణ్‌- శ‌ర్వానంద్ బెస్ట్ ప్రెండ్స్ అన్న సంగ‌తి తెలిసిందే. ఇద్ద‌రు బాల్య స్నేహితులు. శ‌ర్వానంద్ చిన్న‌త‌న‌మంతా చిరంజీవి ఇంట్లోనే.

By:  Tupaki Desk   |   15 Feb 2024 2:30 PM GMT
మెగాస్టార్ లో ఉన్న ప్ర‌తీ క్వాలిటీ మెగాప‌వ‌ర్ స్టార్ లో!
X

రామ్ చ‌ర‌ణ్‌- శ‌ర్వానంద్ బెస్ట్ ప్రెండ్స్ అన్న సంగ‌తి తెలిసిందే. ఇద్ద‌రు బాల్య స్నేహితులు. శ‌ర్వానంద్ చిన్న‌త‌న‌మంతా చిరంజీవి ఇంట్లోనే. ఇంకా చెప్పాలంటే ఇద్ద‌రు ప్రాణ స్నేహితులు. శ‌ర్వానంద్ న‌టుడు అవ్వ‌డానికి కార‌ణం కూడా చిరంజీవి..చ‌ర‌ణ్ అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. మెగా ఫ్యామిలీ స‌హ‌కా రంతో ఇండ‌స్ట్రీ బ్యాక‌ప్ లేని శ‌ర్వానంద్ హీరో అయ్యాడు. అటుపై సొంత ట్యాలెంట్ తో పైకి ఎదిగాడు. తాజాగా ఓ టీవీషోలో చిరంజీవి ఫ్యామిలీతో త‌న‌కున్న అనుబంధం గురించి శ‌ర్వానంద్ మ‌రోసారి పంచు కున్నారు.


ఆవేంటో శర్వా మాట‌ల్లోనే.. `శంకర్‌దాదా ఎంబీబీఎస్‌` చిత్రంలో చిన్న సీన్ కోసం ఓ కుర్రాడు కావాల్సి వస్తే మన శర్వా ఉన్నాడుగా వాడితో చేయిద్దాం అని చరణ్‌తో నాకు కబురు పంపారు. ఆ విష‌యం నాకు తెలిసి షాక్ అయ్యాను. చిరంజీవిగారితో ఫోటో ఉంటే చాలు.. అనుకున్న నాకు ఆయనతో కొన్ని సీన్లు నటించే అవకాశం అలా వచ్చింది. ఇదంతా కూడా రామ్ చ‌ర‌ణ్ నాకు స్నేహితుడు కావ‌డం వ‌ల్లే సాధ్య‌మైంది.

ఈరోజు ఇలా ఈ స్థానంలో ఉన్నాను అంటే కార‌ణం చ‌ర‌ణ్‌. చిరంజీవి గారిలో ఉన్న ప్ర‌తీ క్వాలిటీ చ‌ర‌ణ్ లో ఉంది. ఎవ‌రికైనా ఆప‌ద‌వ‌స్తే చిరంజీవి గారు ఎలా ముందుకొస్తారో చ‌ర‌ణ్ కూడా అంతే. న‌మ్మిన వారిని వ‌దిలి పెట్ట‌డం వాళ్లిద్ద‌రికీ తెలియ‌దు. ప్రేమ‌ను పంచ‌డంలో...క‌ష్ట‌నష్టాల్లో మ‌న‌తో నిలబ‌డ‌టంలో చ‌ర‌ణ్ ది బెస్ట్. చ‌ర‌ణ్ నాకు మంచి స్నేహితుడ‌ని ఎక్క‌డైనా స‌రే గ‌ర్వంగా చెబుతాను` అని అన్నాడు.

`అయితో తారీఖు` అనే చిత్రంతో శ‌ర్వానంద్ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన సంగ‌తి తెలిసిందే. అప్ప‌టి నుంచి దాదాపు రెండు ద‌శాబ్ధాలుగా ప‌రిశ్ర‌మ‌లో కొన‌సాగుతున్నాడు. న‌టుడిగా త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపును ద‌క్కించుకున్నాడు. క‌మ‌ర్శియ‌ల్ చిత్రాల‌తో పాటు డిఫ‌రెంట్ అటెంప్ట్ లు చేయ‌డం శ‌ర్వా ప్ర‌త్యేక‌త‌. ప్ర‌స్తుతం శర్వానంద్ హీరోగా శ్రీరామ్ ఆదిత్య ఓ చిత్రాన్ని తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇది శ‌ర్వా 35వ చిత్రం.