Begin typing your search above and press return to search.

శర్వా కొత్త మూవీ టైటిల్ ఇదే.. డైరెక్టర్ కొడుకు ఎంట్రీ!

శర్వానంద్.. ప్రస్తుతం శమంతకమణి, దేవదాస్ లాంటి చిత్రాలతో ఆకట్టుకున్న శ్రీరామ్ ఆదిత్యతో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే

By:  Tupaki Desk   |   27 Feb 2024 11:49 AM GMT
శర్వా కొత్త మూవీ టైటిల్ ఇదే.. డైరెక్టర్ కొడుకు ఎంట్రీ!
X

టాలీవుడ్‌లో ఉన్న మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్లలో ఒకరు శర్వానంద్‌. ఆయన నటించిన సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎన్ని నెలలు అయిందో తెలుసా? 16 నెలలు. ఒకే ఒక జీవితం అనే సినిమాతో చివరగా 2022లో ప్రేక్షకుల ముందుకు వచ్చారు శర్వానంద్. ఆ తర్వాత 2023లో ఒక్క సినిమా కూడా విడుదల చేయలేదు. ఇక 2024లో రెండు చిత్రాలతో అలరించనున్నారు.

శర్వానంద్.. ప్రస్తుతం శమంతకమణి, దేవదాస్ లాంటి చిత్రాలతో ఆకట్టుకున్న శ్రీరామ్ ఆదిత్యతో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. శర్వా 35వ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. కొన్ని నెలల క్రితం.. ఈ మూవీ షూటింగ్ లండన్ లో జరిగినట్లు అప్డేట్ వచ్చింది. ఆ తర్వాత హైదరాబాద్ లో కూడా జరిగినట్లు తెలిసింది. అయితే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి BOB అనే టైటిల్ ఖరారు చేసినట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి.

ఈ సినిమా స్టోరీ అంతా ఓ బాబు చుట్టూ తిరుగుతోందట. అందుకే BOB అని టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు టాక్ వినిపించింది. కానీ టాలీవుడ్ సినీ ఆడియన్స్ కు దగ్గరవ్వాలని మరో టైటిల్ ను మేకర్స్ రిజిస్టర్ చేయించారట. 'మనమే' అనే కొత్త టైటిల్ ను మేకర్స్ రిజిస్టర్ చేయించినట్లు తెలుస్తోంది. ఈ రెండింటిలో ఏదో ఒక టైటిల్ ను ఫిక్స్ చేయనున్నారట మేకర్స్. త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారట.

అయితే ఈ మూవీలో కీలకమైన బాబు రోల్ ను డైరెక్టర్ శ్రీరామ్ కుమారుడే పోషిస్తున్నారట. శ్రీరామ్ నాలుగేళ్ల కుమారుడు.. ఈ సినిమాతో టాలీవుడ్ కు చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయమవ్వనున్నారట. ఈ మూవీ కోసం పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ.. భారీగా ఖర్చు పెడుతోంది. ఇప్పటికే రూ.50 కోట్లకు పైగా ఖర్చు పెట్టిందట. అబ్దుల్ వాహబ్ మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీ నుంచి త్వరలో టీజర్ విడుదల కానుందట.

ఇక శర్వానంద్.. ఈ మూవీతో పాటు సామజవరగమనతో సూపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ రామ్ అబ్బరాజుతో మరో సినిమా చేస్తున్నారు. ఇటీవల సైలెంట్ గా ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉండనున్నట్లు తెలుస్తోంది. అయితే శర్వానంద్ కొత్త సినిమాలు ఎలా ఉంటాయో చూడాలి.